Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో మ‌రోసారి చేరిన సునీత బోయ

Advertiesment
Sunita Boya
, గురువారం, 9 జూన్ 2022 (17:45 IST)
Sunita Boya
తెలుగు ఇండస్ట్రీలోని ఒక ప్రముఖ నిర్మాతపై కొన్ని సంవత్సరాలుగా  తప్పుడు ఆరోపణలు చేస్తున్న సునీత బోయ అనే మహిళను పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు ఎర్రగడ్డ మానసిక వైద్యుశాలకు తరలించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.
 
తన పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న సునీత బోయ పై ఇప్పటికే ఆ నిర్మాత   న్యాయపరంగా పోరాడుతున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు సునీత బోయ ఒక అగ్ర నిర్మాణ సంస్థ ,పెద్ద నిర్మాతపై నిరాధారమైన ఆరోపణలు చేస్తు వచ్చిన విషయం తెలిసిందే.. సమాజంలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని.. ఎప్పటికప్పుడు  వార్త హెడ్ లైన్స్‌లో ఉండటానికి కావాలనే వివాదాస్పద విషయాల్లో  సునీత బోయ తలదూర్చే వారు. కానీ ఆ ప్రముఖ నిర్మాత ఓపికగా ఈ విషయంలో న్యాయ పరంగా చర్యలు చేపట్టారు.. నిర్మాత విషయంలో సునీత ఒక దశలో హద్దుమీరి ప్రవర్తించారు. 
 
సునీత చాలా రకాలుగా బెదిరింపులకు, అబద్ధపు ఆరోపణలకు దిగినా నిర్మాతగా బెదరలేదు. ఈమె మానసిక పరిస్థితి బాగోలేదు అని గతంలోనే  ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఆ నిర్మాత చెప్పారు. అంతే కాదు కొన్ని రోజులు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొని వచ్చిన సునీత బోయలో మార్పు వస్తుంది అని ఆశించారు కూడా.. కానీ కొద్దినెలల తర్వాత  తాజాగా మరోసారి సునీత అకారణంగా ఆరోపణలు మొదలుపెట్టడం తో పోలీసులను ఆశ్రయించారు.
 
ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యాయమూర్తి ముందు సునీతను హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో అన్ని పరిశీలించిన న్యాయమూర్తి సునీత మానసిక పరిస్థితీ సరిగా లేదని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల ప్రకారం మానసిక వైద్యశాలలో అడ్మిట్ చేసినట్టు సమాచారం వస్తుంది. ఈ ఒక్క కారణం చాలు మానసిక ఆరోగ్యం స్థిమితంగా లేని సునీత బోయ చేసిన ఆరోపణలన్నీ తప్పు అని చెప్పడానికి.. సునీత బోయ వివాదం ఇక్కడితో ముగిసిందని దయచేసి నిరాధారమైన ఆరోపణలు చేసే ఇటువంటి వ్యక్తుల ఆరోపణలను ప్రసారం చేసేముందు మీడియా సంయమనం పాటించాలి అని ఆ ప్రముఖ నిర్మాత విజ్ఞప్తి చేశారు.. కోర్టు పరిధిలోని అంశాలపై స్పందించడం సరికాదని ఒక ప్రకటన విడుదల చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిలకలూరిపేటలో అఖండ రికార్డ్ సృష్టించింది