Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఏంటది?

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (11:07 IST)
భారత బ్యాంకింగ్ దిగ్గడం ఎస్పీఐ తన బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇప్పటికే అనేక రకాలైన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులోభాగంగా, ఇపుడు మరో కొత్త సర్వీసును తీసుకొచ్చింది. ఇకపై ఏటీఎం కార్డు లేకుండానే ఏటీఎం కేంద్రాల నుంచి నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ వెసులుబాటును కేవలం ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల నుంచే కాకుండా ఏ ఇతర బ్యాంకు ఏటీఎం కేంద్రాల నుంచైనా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. 
 
ఇప్పటివరకు ఈ సదపాయం కేవలం పరిమిత ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇపుడు అన్ని ఏటీఎం కేంద్రాల్లో తీసుకుని రానుంది. ఇందుకోసం యోనో యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా యూపీఐ లావాదేవీల కోసం యోనో యాప్‌ను వాడుకునే ఎస్బీఐ మార్పులు చేసింది. ఇందుకోసం యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్ అనే థీమ్‌ను తీసుకొచ్చింది. స్కాన్, పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయని ఎస్బీఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments