Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో రిల‌య‌న్స్ జియో ట్రూ5జీ సేవ‌లు ప్రారంభం

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (21:23 IST)
కర్టెసీ-రిలయన్స్ జియో
రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏలూరులో శనివారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు, తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.


ఆంధ్రప్రదేశ్‌లో నెట్వర్క్ కోసం జియో ఇప్ప‌టికే రూ. 26,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. అదనంగా 5 జి నెట్వర్క్‌ను ఏర్పాటు చేయడానికి మరో రూ. 6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల జియోకున్న అపారమైన నిబద్ధతను చూపిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
 
జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్‌ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి మరియు ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. జియో ట్రూ 5 జి పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్ట‌చివ‌రి అడుగు వ‌ర‌కు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
 
ఈ సందర్భంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మందపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ లో జియో ట్రూ 5జీని విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ -5 జి ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు. అందువ‌ల్ల ఈ గ‌ణ‌నీయ‌మైన మార్పుకు ఉన్న శ‌క్తి, దాని అపార ప్ర‌యోజ‌నాల‌ను మ‌న దేశంలోని ప్ర‌తి పౌరుడు అనుభవించగలడు.  ఆంధ్రప్రదేశ్ ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర  ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అన్నారు.  
 
ఏలూరుతో పాటు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 15 నగరాల్లో… ఛత్తీస్‌గఢ్ (రాయ్‌పూర్, దుర్గ్, భిలాయ్), బీహార్ (పాట్నా, ముజఫర్‌పూర్), జార్ఖండ్ (రాంచీ, జంషెడ్‌పూర్), కర్ణాటక (బీజాపూర్, ఉడిపి, కలబురగి, బళ్లారి), ఒడిశా (రూర్కెలా, బ్రహ్మపూర్), కేరళ (కొల్లం), మహారాష్ట్ర (అమరావతి)లో జియో ట్రూ 5G సేవలు ప్రారంభం అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments