Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20 యేళ్ల కనిష్టానికి పడిపోయిన బంగారం ధరలు

gold
, శుక్రవారం, 13 జనవరి 2023 (13:35 IST)
దేశంలో బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. ఏకంగా 20 యేళ్ళ కనిష్టానికి ఈ ధరలు తగ్గిపోయాయి. గత డిసెంబరు నెలలో బంగారం దిగుమతులు ఏకంగా 79 శాతం మేరకు తగ్గిపోయాయి. రెండు దశాబ్దాల కాలంలో ఇంత కనిష్టానికి పడిపోవాడం ఇదే కావడం గమనారం. 
 
ప్రస్తుతం బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 2022 డిసెంబరు నెలలో 20 టన్నుల బంగారం దిగుమతి అయింది. కానీ 2021 డిసెంబరు నెలలో దిగుమతులు 95 టన్నులుగా ఉండటం గమనార్హం. విలువపరంగా చూస్తే యేడాది క్రితం 4.73 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులు చేుసుకోగా, క్రితం నెలలో 1.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 
 
ఇక 2022లో మన దేశంల 706 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది.2021లో 1068 టన్నుల దిగుమతి బంగారంతో పోల్చితే గత యేడాది 30 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తుంది. మన దేశ బంగారం అవసరాల్లో 90 శాతం దిగుమతుల రూపంలోనే తీరుతుంది. గత యేడాది ఈ బంగారం దిగుమతి కోసం ఏకంగా 33.6 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారు. ధరలు పెరగడంతో రిటైల్ కొనుగోళ్లు తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారాహిని అడ్డుకుంటారా.. ఆయనకు తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు .. అపుడు మీకు కాశీయాత్రే : హైపర్ ఆది