Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ పరిధిలోకి పెట్రో ధరలు : నిర్మలమ్మ ఏంటున్నారు?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (13:26 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగదలను సాకుగా చూపి దేశీయంగా పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచేశారు. ఫలితంగా దేశంలో ఇంతకుముందెన్నడూ లేనంతగా లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిపోయింది. దీంతో జనం గగ్గోలు పెట్టారు. అయినప్పటికీ.. కేంద్రం మిన్నకుండిపోయింది. 
 
పెరుగుతున్న ధరలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు, మేధావులు డీజిల్, పెట్రోల్ ధరలను వస్తు సేవల పన్ను పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే సుంకాలే మొత్తం ధరలో సగానికి పైగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి వచ్చాయి. తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. 
 
లోక్‌సభలో ఫైనాన్స్ బిల్ 2021పై జరిగిన చర్చకు సమాధానంగా మాట్లాడిన నిర్మలా సీతారామన్, కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాలను తగ్గించాల్సివుందన్నారు. ఈ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తే, కేంద్రం సుంకాలను రాష్ట్రాలతో పంచుకుంటుందని స్పష్టం చేశారు.
 
"నేడు జరిగిన చర్చ తరువాత నేనెంతో నిజాయతీగా ఆలోచించాను. ఎన్నో రాష్ట్రాలు దీన్ని పరిశీలిస్తున్నాయి. తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించడానికి సానుకూలంగా ఉన్నాము. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలూ లేవు. అయితే, రాష్ట్రాలే ముందడుగు వేయాలి" అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments