Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త: ఐఎంపీఎస్ గరిష్ట పరిమితి పెంపు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (16:13 IST)
పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త వినిపించింది. ఆన్ లైన్ చెల్లింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని పెంచింది. 2014 జనవరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు ఉండేది. తాజాగా.. దీనిని రూ. 5లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ (RBI) ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సాహించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. 
 
వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేయడం జరిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల డిజిటల్ చెల్లింపులు మరింతగా పెరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై త్వరలోనే బ్యాంకులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు. 
 
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఐఎంపీఎస్ బ్యాంకుల లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు క్షణాల్లో డబ్బులు పంపించేందుకు దీనిని ఉపయోగిస్తుంటారు. 2010లో తొలిసారిగా దీనిని ప్రారంభించారు. 24 గంటల పాటు ఈ సేవలు పని చేస్తాయి. 2014 జనవరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆ పరిమితిని పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments