కేవైసీ అప్డేట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది.. బ్యాంకు ఖాతా లాగిన్ వివరాలు, వ్యక్తిగత సమా చారం, నో యువర్ కస్టమర్ (కేవైసీ) డాక్యుమెంట్ల కాపీలు, డెబిట్/క్రెడిట్ కార్డు సమాచారం, పిన్, పాస్వర్డ్ ఓటీపీ మొదలైన వాటిని గుర్తు తెలియని వ్యక్తులు లేదా ఏజెన్సీలతో పంచుకోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కస్టమర్లను హెచ్చరించింది.
అనధికార వెబ్సైట్లు, అప్లికేషన్స్లో వివరా లను షేర్ చేయవద్దని సెంట్రల్ బ్యాంక్ సలహా ఇచ్చింది. సెంట్రల్ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు ఖాతాల కేవైసీ అప్డేట్ పేరుతో జరుగుతున్న మోసా ల వల్ల వినియోగదారులు బలైపోతున్నట్టు ఫిర్యాదులు అందినట్టు ఆర్బీఐ తెలి పింది.
ఒకవేళ ఎవరైనా కేవైసీ అప్డేట్ పేరుతో కాల్ లేదా మెసేజ్ చేసిన వెంటనే మీ సంబంధిత బ్రాంచీ లేదా బ్యాంకును సంప్రదించాలన్నారు. కాల్/ మెసేజ్/అనధికార అప్లికేషన్ ద్వారా కస్టమర్ సమాచారాన్ని పంచుకున్న తరువా త మోసగాళ్ల కస్టమర్ ఖాతాను యాక్సెస్ చేసి ఖాతాలో ఉన్న డబ్బు ఖాళీ చేస్తున్నా రని తెలిపింది. కేవైసీ అప్డేట్ సరళీకృతం చేసినట్టు ఆర్బీఐ వివరించింది.