Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్ లోన్ కంపెనీలకు ఆర్బీఐ షాక్.. భారీ జరిమానా

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (15:06 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గోల్డ్ లోన్ కంపెనీలకు షాకిచ్చింది. మణప్పురమ్ ఫైనాన్స్‌, ముత్తూట్ ఫైనాన్స్‌ సంస్థలు నిర్దేశిత నిబంధనలను అతిక్రమించారంటూ ఇరు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్‌లకు వరుసగా రూ.10లక్షలు, రూ.5లక్షలు జరిమానా విధించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఎర్నాకులంలోని ముత్తూట్ ఫైనాన్స్ విభాగం గోల్డ్ లోన్లకు సంబంధించి లోన్ టు వ్యాల్యూ రేషియా మార్గదర్శకాలను ముత్తూట్ ఫైనాన్స్ అనుసరించలేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
 
అంతేకాకుండా సంస్థ రూ.5 లక్షలకు పైన బంగారు రుణాలు జారీ చేసేటప్పుడు రుణ గ్రహీతల నుంచి పాన్ కార్డు తీసుకోవడమనే రూల్స్‌ను అనుసరించలేదని, అందుకే ఫైన్ వేశామని వివరణ ఇచ్చింది. దీంతోపాటు గోల్డ్ జువెలరీ ఓనర్‌షిప్ వెరిఫికేషన్‌ రూల్స్‌ను అనుసరించకపోవడంతో త్రిసూర్‌లోని మణపురం ఫైనాన్స్‌పై ఆర్‌బీఐ చర్య తీసుకుంది. రూ.5 లక్షల జరిమానా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments