Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుకున్నదే నిజమైంది.. ఎన్నికలైన మరుసటి రోజే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Webdunia
సోమవారం, 20 మే 2019 (18:00 IST)
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు 8-10 పైసలు మేర పెరగ్గా, డీజిల్ ధరలు మాత్రం 15-16 పైసలు మేర పెరిగాయి. 
 
ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డేటా ప్రకారం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.71.12 కాగా, డీజిల్ ధర రూ.66.11గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర పెరగడం వల్లే దేశీయ మార్కెట్‌లోనూ ఇంధన ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
 
చమురు ఉత్పత్తి దేశాలు పరిమిత క్రూడ్ ఆయిల్ సరఫరా చేయడానికి ఒప్పుకున్నట్లు సౌదీ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ ప్రకటించిన తర్వాత ధరలు 1% మేర పెరిగాయి. ప్రస్తుతం ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.76.73, డీజిల్ ధర రూ.69.27గా ఉంది. కోల్‌కతా, చెన్నైలలో లీటరు పెట్రోల్ ధర రూ.73.19 నుంచి ధర రూ.73.82కి ఎగబాకింది. డీజిల్ ధర రూ.67.86 నుంచి రూ.69.88కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments