పెట్రో బాదుడే బాదుడు : మళ్లీ పెరిగిన చమురు ధరలు

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (09:50 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల గగ్గోలుపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ధరల బాదుడు మోత పెరుగుతూనేవుంది. ఈ క్రమంలో తాజాగా మరోమారు పెట్రోల్, డీజల్ ధరలు పెంచారు. 
 
జూన్ నెల పుట్టిన తర్వాత ఐదోసారి చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పటికే రేట్లు ఆల్‌ టైమ్‌ గరిష్ఠానికి చేరుకోగా.. బుధవారం లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.56కి చేరగా.. డీజిల్‌ ధర రూ.86.47కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్‌ ధర రూ.102 వైపు పరుగులు పెడుతుండగా.. ప్రస్తుతం రూ.101.76, డీజిల్‌ రూ.93.85 పలుకుతోంది.
 
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.95.52, డీజిల్‌ రూ.89.32, చెన్నైలో పెట్రోల్‌ రూ.96.94, డీజిల్‌, రూ.96.94కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.99.32, డీజిల్‌ రూ.94.26.. విజయవాడలో పెట్రోల్‌ రూ.101.55, డీజిల్‌ రూ.95.90కి చేరింది. 
 
మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు ఇంధన ధరలు 22వ సార్లు పెరిగాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యులు పెట్రోల్‌ బంకుకు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో రోజురోజుకు పైపైకి వెళ్తున్న ధరలతో జనం బెంబేలెత్తుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments