Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎల్పీజీ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఎల్పీజీ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
, గురువారం, 10 జూన్ 2021 (22:06 IST)
ఎల్పీజీ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో గ్యాస్‌ వినియోగదారులు ఇకపై తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ నుంచి రిఫిల్‌ సిలిండర్లను పొందవచ్చునని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గురువారం రోజున ప్రకటన చేసింది. కాగా ఈ సదుపాయాన్ని ప్రస్తుతం చండీగఢ్‌, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీ నగరాలల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనుంది. 
 
త్వరలోనే ఈ సదుపాయం దేశవ్యాప్తంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌, ఐఒసీలతో జతకట్టి రాష్ట్రాలలో 21,000 ఇప్పటివరకు ఎల్‌పిజి కేంద్రాలను తెరిచినట్లు సీఎస్‌సీ ఎస్‌పీవీ డైరక్టర్‌ దినేష్‌ త్యాగి ఒక ప్రకటనలో తెలిపారు. 
 
అంతేకాకుండా దేశవ్యాప్తంగా మార్చి 2022 నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి సుమారు ఒక లక్ష ఎల్పీజీ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి మత్తుకు బానిస కాకూడదన్నదే నా తపన: ఎంఎల్ఏ భూమన