Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతి మత్తుకు బానిస కాకూడదన్నదే నా తపన: ఎంఎల్ఏ భూమన

తిరుపతి మత్తుకు బానిస కాకూడదన్నదే నా తపన: ఎంఎల్ఏ భూమన
, గురువారం, 10 జూన్ 2021 (20:50 IST)
ఎంతోమంది సత్పురుషులు, ఋషులు, జగద్గురువు ఆదిశంకరాచార్యులు, అన్నమాచార్యులు వంటి మహానుభావులు నడయాడిన తిరుపతి నగరంలో అనాగరికానికి, అరాచాలకు తావులేకుండా చూడాలన్నదే నా తపన అని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు.
 
గురువారం సాయంత్రం రోజువారీ పర్యటన లో భాగంగా సత్యనారాయణ పురం, జీవకోన వంటి మారుమూల ప్రాంతాల్లో  కార్ఫ్యూ సమయంలో దారిలో కనిపించిన పెద్ద, చిన్నలను పెద్దమ్మ బాగున్నవా .., యువత పలకరిస్తూ మాస్కు బాగా ధరించండి..., ఏమి చదువుతున్నారు.. పెద్దాయన బాగున్నవా ..అని పలకరిస్తూ నడక సాగించారు.

దారిలో రేషన్ కోసం వేచియున్న మహిళలను చూసి , డీలర్ కు ఫోన్ చేసి, వెంటనే రేషన్ అందించేలా చూడాలని, సమయపాలన లేకుంటే చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవకోన ఈశ్వరాలయ ఆవరణలో ఆడుకుంటుంన్న పిల్లలను పలకరించి మాస్కులు సక్రమంగా దరించాలని సూచించారు.

నవజీవన్ కాలనీలో మహిళలు పిర్యాదు లు చేస్తూ మీరు తీసుకున్న చర్యలవల్ల రౌడీమూకల ఆగడాలు తగ్గాయని, పోలీసులు వస్తున్నారని, అయినా ఇంకా అప్పుడప్పుడు మోండోడి గుంట కట్ట మీద త్రాగుడు చేస్తున్నారని పిర్యాదు చేయగా తన ఫోన్ నెంబరు ఫోన్ చేయాలని వారికి తెలిపారు. దారిలో మహిళా సంఘాలు మీటింగ్ లను పరిశీలించారు.
 
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన పర్యటనలో గమనించిన విషయాన్ని ఎస్.పి.దృష్టికి తీసుకుని వెళ్లడంతో పోలీసులు నిఘా పెట్టారని ధన్యవాదాలని అన్నారు. ప్రపంచ చరిత్ర గలిగిన తిరుపతి నగరంలో సత్పురుషులు నడయాడిన నేలలో భాద్యత కలిగిన వ్యక్తిగా , స్థానిక ఎమ్మెల్యే గా  ఇక్కడ సంఘవిద్రోహక చర్యలకు తావులేకుండా చడాలన్నదే నా తపన అన్నారు.

ఎంతోమంది మేధావులు, స్వామీజీ లు వున్న తిరుపతి లో యువత మట్టుకు బానిసలవుతుంటే సామాజిక భాద్యతతో, అందరిసహకారంతో ఎదో ఒక రకంగా అనాగరిక, అరాచక చర్యలు అరికట్టాలని అన్నారు.

యువత మట్టుకు బానిసై, తలిదండ్రులకు బారమై, సంఘానికి బరువు కాకూడదని నా ఈ నడకలో గమనించిన విషయాన్ని, తిరుపతిని ఆధ్యాత్మిక శోభ లో నిలపాలనే  వ్రాతపూర్వకంగా పోలీసులకు వ్రాతపూర్వకంగా ఇచ్చానని అన్నారు. పోలీసుల తీసుకుంటున్న చర్యలు, మీడియా సహాకారంకు  ధన్యవాదాలు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళిత సంఘాలకు బహిరంగ లేఖ రాసిన వర్లరామయ్య