Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో బాదుడుపై ఇప్పట్లో ఉపశమనం లేనట్టే : నిర్మాలా సీతారామన్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (17:11 IST)
దేశంలో మండిపోతున్న చమురు ధరల నుంచి దేశ ప్రజలకు ఇప్పట్లో ఉపశమనం కలిగే మార్గం కనిపించడంలేదని కేంద్ర విత్తమంత్రి నిర్మాలా సీతారమన్ అభిప్రాయపడ్డారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం(ఏటీఎఫ్‌), సహజవాయువు(గ్యాస్‌)ను తీసుకొస్తే పన్నుల భారం తగ్గే అవకాశం ఉంటుందని గతంలో ఆమె వ్యాఖ్యానించారు. 
 
అయితే, వీటిని ఇప్పటికిప్పుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం ఉన్న జీఎస్టీ మండలిలో ఇప్పటి వరకూ ఎవరూ కూడా ఆయా ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించలేదని గుర్తుచేశారు.
 
ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆమె వివరించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పన్నులను కలిపేస్తూ 2017 జులై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ పరిధి నుంచి ముడిచమురు, పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం, గ్యాస్‌లను మినహాయించారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం సుంకాలను, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను విడివిడిగా విధించడాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments