దేశరాజధాని ఢిల్లీలో వరుసగా 12 రోజు అంటే ఈరోజు(శనివారం)కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుపై 35 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 37 పైసలు చొప్పున పెరిగింది.
దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 90.58, డీజిల్ ధర రూ.80.97కు చేరుకుంది. దీనికి ముందు శుక్రవారం ఢిల్లీలో పెట్రోల్ ధర తొలిసారిగా 90 రూపాయలు దాటింది.
అలాగే డీజిల్ ధర రూ. 80.60కి చేరుకుంది. డీజిల్, పెట్రోలుతో పాటు వంటగ్యాస్ ధర కూడా పెరుగుతూ వస్తోంది. ఈ ధరల పెరుగుదల సామాన్యునికి పెను భారంగా పరిణమించింది. మరోవైపు పెట్రో ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి.