పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో పేరు రిజిష్టర్ చేసుకుంటే, పెళ్లి పేరుతో పరిచయం అయ్యి బ్లాక్ మెయిల్ చేయటానికి ప్రయత్నించిన యువతి ఉదంతం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెంగుళూరు, హులిమావులో నివసించే 33 ఏళ్ల అంబిత్ కుమార్ మిశ్రా వివాహా ప్రయత్నాల్లో భాగంగా తన ప్రోఫైల్ ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో రిజిష్టర్ చేసుకున్నాడు.
ఈ క్రమంలో అతనికి శ్రేయ అనే యువతి పరిచయం అయ్యింది. తానోక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అని, ఎలక్ట్రానిక్ సిటీలో పని చేస్తున్నానని పరిచయం చేసుకుంది.
అంబిత్ ప్రోఫైల్ మ్యాట్రి మోనీ సైట్ లో చూశానని, అతడ్ని పెళ్ళి చేసుకోటానికి ఇష్టపడుతున్నట్లు తెలిపింది. దీంతో ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకోవటం మొదలెట్టారు.
ఈ క్రమంలో వాట్సప్‌లో చాటింగ్ కూడా మొదలెట్టారు. రాను రాను వాట్సప్ వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకోవటం కూడా చేస్తున్నారు.
అదే క్రమంలో ఫిబ్రవరి7 వ తేదీన వాట్సప్ వీడియో కాల్ చేసిన అంబిత్ , శ్రేయ మొదట సరదాగా మాట్లాడుకున్నారు ఇద్దరూ. ఇంతలో ఆమె తన ఒంటి మీద దుస్తులు ఒక్కటొక్కటిగా తీసి నగ్నంగా అతడి ముందు నిలబడింది. ఆమెను అలా చూసి నిశ్చేష్టుడైపోయాడు.
అనంతరం అంబిత్‌ను కూడా దుస్తులు తీసేసి నగ్నంగా కనపడమని కోరింది శ్రేయ. ఆమె చెప్పినట్లుగానే అంబిత్ దుస్తులు విప్పేసి నగ్నంగా ఆమె తో మాట్లాడటం మొదలెట్టాడు. దీన్నంతా ఆమె వీడియో రికార్డింగ్ చేసింది.
మర్నాడు ఫోన్ చేసి అంబిత్ నగ్నంగా ఉన్నవీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని….. అలా చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. భయపడిపోయిన అంబిత్ వెంటనే 20 వేల రూపాయలు ఆమెకు చెల్లించాడు.
ఆమె అంతటితో ఆగకుండా డబ్బు కోసం మళ్లీ మళ్లీ ఫోన్ చేయసాగింది. ఈ నేపథ్యంలో అంబిత్ ఫిబ్రవరి 15న హులిమావు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రేయ పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించారు.