Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే టోల్‌ప్లాజాలు లేని హైవేలను చూస్తాం.. నితిన్ గడ్కరీ

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (13:26 IST)
టోల్‌ప్లాజాలు లేని హైవేలను త్వరలోనే చూస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. బుధవారం ఆయన ప్రీమియర్‌ ఇండస్ట్రీ చాంబర్‌ (సీఐఐ) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జాతీయ రహదారులపై టోల్‌ సేకరణ కోసం ప్లాజాలకు బదులుగా.. కేంద్రం జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను తీసుకురాబోతుందని ప్రకటించారు. ఇందుకు రాబోయే మూడునెలల్లో కొత్త పాలసీ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
 
వచ్చే ఏడాది జీపీఎస్‌ ఆధారిత టోల్‌ సేకరణ వ్యవస్థ అమలులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలు లేదని.. టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రోడ్ల నిర్మాణంలో నిమగ్నమైన అన్ని కంపెనీలు స్టీల్‌, సిమెంట్‌ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. వాటి ధర, పరిణామాన్ని తగ్గించేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments