Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12-08-2021 గురువారం దినఫలాలు - సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా జయం

12-08-2021 గురువారం దినఫలాలు - సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా జయం
, గురువారం, 12 ఆగస్టు 2021 (04:00 IST)
మేషం : కపటం లేని మీ ఆలోచనలు సలహాలు మీకు అభిమానులను సంపాదించి పెడుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పట్టుదలతో శ్రమించే మీకు సన్నిహితుల సాయం తోడవుతుంది. వాహనం నపుడునపుడు మెళకువ అవసరం. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. 
 
వృషభం : ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. స్త్రీలు బంధువుల నుంచి అవమానాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. 
 
మిథునం : స్త్రీలకు తల, నరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారు మీకు సమ ఉజ్జీలేనని గ్రహించండి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విద్యార్థులకు పొరుగు రాష్ట్రంలో పై చదువులకు అవకాశం లభిస్తుంది. కొంతమంది మీ నుంచి ధనం లేదా ఇతరాత్రా సహాయం అర్ధిస్తారు. 
 
కర్కాటకం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఊహించని ఖర్చులు, ధనం సమయానికి అందకపోవడం వల్ల కించిత్ ఇబ్బందులెదుర్కొంటారు. 
 
సింహం : స్థిరాస్తుల విషయంలో ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. రావలసిన ధనం వాయిదాపడుతుంది. ఓరమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. 
 
కన్య : స్త్రీలకు సెంటిమెంట్లు, శకునాల ప్రభావం అధికం. కుటుంబీకుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. వైద్య చికిత్స చేయునపుడు మెళకువ అవసరం. ప్రేమికులకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. 
 
తుల : ఆర్థికంగా పురోగమించడానికి కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల్లో కష్టనష్టాలు నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు, నగదు అవార్డు వంటి శుభ సంకేతాలున్నాయి. ఆస్పత్రి, బిల్లులు, పెన్షన్, గ్యాట్యుటీ వ్యవహారాల్లో అవాంతరాలు తప్పకపోవచ్చు. గృహమునకు కావాల్సిన వస్తువులను అమర్చుకుంటారు. 
 
వృశ్చికం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేయునపుడు మెళకువ అవసరం. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. 
 
ధనస్సు : తలపెట్టిటన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టవలసి ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
 
మకరం : ఆహార, వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాట పడవలసి వస్తుంది. బంధువులతో పట్టింపులేర్పడే ఆస్కారం ఉంది. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కుంభం : ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. 
 
మీనం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. వ్యాపారస్తులకు సంతృప్తికానవచ్చును. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి చేయడం కష్ట సాధ్యం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వర్ణాకర్ష భైరవుడిని ఎలా పూజించాలి...?