Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-08-2021 మంగళవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చించినా...

Advertiesment
10-08-2021 మంగళవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చించినా...
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (04:00 IST)
మేషం : మీ సంతానానికి స్థోమతకు మించిన వాగ్ధానాల ఇవ్వడం వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ఏంతో ముఖ్యం. 
 
వృషభం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి  సంతృప్తి, పురోభివృద్ధి. పాతవస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. బంధు మిత్రుల నుంచి ధన సహాయ విషయంపై ఒత్తిడి, మొహమ్మాటాలు అధికంగా ఉంటాయి. 
 
మిథునం : ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరుల మధ్య ఒక అవగాహన ఏర్పడుంది. ఉద్యోగస్తులకు అందిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ధనం ఇతరులకు ఇచ్చినా తిరిగి రాజాలదు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. 
 
కర్కాటకం : పత్రికా, ప్రైవేటు సంస్థలలోనివారికి ఆశాజనకం. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో మెళకువ వహించండి. దంపతులు ప్రతి విషయంలోనూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు విషయంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. 
 
సింహం : ఆదాయానికి మించిన ఖర్చులు వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. మార్కెటింగ్ రంగాల వారికి యాజమాన్యం నుంచి అనుక్షణం వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. విధి నిర్వహణలో మీరు కనబరిచిన శ్రద్ధ, సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు, ఆర్థిక పురోభివృద్ధి పొందుతారు. 
 
కన్య : ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా ఎదుర్కొంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఆకస్మికంగా ప్రయాణాలు సందర్శిస్తారు. వీలైనంత తక్కువగా మాట్లాడి ఎదుటివారి నుంచి సమాచారం రాబట్టేందుకు యత్నించండి. భాగస్వామిక వ్యవహారాల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. 
 
తుల : విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు విలాస వస్తువులు, ఆడంబరాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్త్ర, బంగారం వ్యాపారులకు సామాన్యం. క్రయ విక్రయాలు మందకొడిగా ఉంటాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. రుణయత్నం ఫలిస్తుంది. 
 
వృశ్చికం : నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు తలకిందులవుతాయి. హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం వుంది. వ్యవసాయ కూలీలకు ఆశాజజనకం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
ధనస్సు : రావలసిన ధనం చేతికందుతుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలు ఉంటాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రతి విషయంలోనూ ఏకాగ్రత ముఖ్యం. చేతివృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. 
 
మకరం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ మాటకు కుటుంబంలోను, సంఘంలోనూ వ్యతిరేకత ఎదురవుతుంది. ఉద్యోగస్తులకు వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
కుంభం : గృహ నిర్మాణాల్లో వ్యయం మీ అంచనాలను మించుతుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారల శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. స్త్రీలకు ఖరీదైన వస్తు కొనుగోళ్ళలో ఏకాగ్రత అవసరం. సమయానుకూలంగా మీ ఆహారపు అలవాట్లు, పద్దతులు మార్చుకోవలసి వస్తుంది. 
 
మీనం : స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పాతమిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనివాసుని పుష్పాలతో అగరబత్తీలు, శ్రీవారి భక్తులకు అందుబాటులో ఎప్పుడు వస్తుందంటే..?