Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద్‌తో ఇషా అంబానీ నిశ్చితార్థం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ముగిసింది. ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో ఈ నిశ్చితార్థం జరిగింది. ఇది ఈషా మహాబలేశ్వరంలో

Webdunia
సోమవారం, 7 మే 2018 (13:00 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ముగిసింది. ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో ఈ నిశ్చితార్థం జరిగింది. ఇది ఈషా మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. ఆనంద్‌, ఇషాలు చిన్ననాటి స్నేహితులు.
 
కొద్దిరోజుల క్రితం మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఆనంద్‌, ఇషాకు ప్రపోజ్‌ చేశారు. ఇషా కూడా అంగీకారం తెలపడంతో అక్కడే ఉంగరాలు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వారి వారి కుటుంబాలకు విషయం చెప్పారు. మఖేష్ కుమారుడు ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం కంటే ముందే ఆనంద్‌, ఇషాల వివాహం జరిగే అవకాశం ఉంది. 
 
అయితే, ఆనంద్ - ఇషాల పెళ్లి తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. పైగా, దీనిపై ముఖేష్, అజయ్ కుటుంబ సభ్యులు ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, ఆనంద్‌ పిరమల్ దేశంలో పిరామల్‌ ఈ-స్వాస్థ్య, పిరామల్‌ రియాల్టీ అనే స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్న విషయం తెల్సిందే. ఇషా రిలయన్స్ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో సభ్యురాలిగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments