Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ 2021 : ముఖేష్ అంబానీ టాప్ - ఆదానీ సంపద 49 శాతం పెరుగుదల

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:58 IST)
ఫోర్బ్స్‌‌ 2021 రిచ్‌‌లిస్ట్‌‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ బాస్‌‌ ముకేశ్‌‌ అంబానీ మళ్లీ టాప్‌లో నిలిచారు. 2008 నుంచి ఆయన నెంబర్‌‌ వన్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈయన మొత్తం సంపద 92.7 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్‌‌ ప్రకటించింది. 
 
రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ తాజాగా రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌లోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఇందుకోసం 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఫోర్బ్స్‌‌ రిచ్‌‌లిస్ట్‌‌లోని టాప్ 100 మంది సంపద 775 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్‌‌ ఇండియా ప్రకటించింది.
 
గత యేడాదితో పోల్చితే 257 బిలియన్ డాలర్లు పెరిగిందని తెలిపింది. సుమారు 61 మంది బిలియనీర్లు తమ సంపదకు కనీసం ఒక బిలియన్ డాలర్లను యాడ్‌‌ చేసుకోగలిగారని ఫోర్బ్స్‌‌ పేర్కొంది. రిచ్‌‌లిస్ట్‌‌లోని 80 శాతం మంది సంపద పెరిగిందని తెలిపింది. గత ఏడాది కాలంలో అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లు పెరిగింది.
 
ఈ రిచ్‌‌లిస్టులో రెండో స్థానంలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన సంపద 74.8 బిలియన్‌‌ డాలర్లుగా ఉంది. గత ఏడాది కాలంలో ఫోర్బ్స్ రిచ్‌‌ లిస్టులోని ఇతర బిలియనీర్ల కంటే అదానీ సంపద 200 శాతం పెరిగింది. అంటే ఆయన సంపద ఒక్క ఏడాదిలోనే 49.5 బిలియన్ డాలర్లు ఎగిసింది. ముఖ్యంగా, ఈయన సంపద భారత్‌లో కరోనా కష్టకాలంలోనే పెరిగింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments