Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 25వేల మందికి మాత్రమే అయ్యప్ప దర్శనం.. కేరళ సీఎం

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:52 IST)
Sabarimala
కేరళ శబరిమల అయ్యప్ప స్వామిని రోజుకు 25వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని కేరళ సర్కారు నిర్ణయించింది. వచ్చే నెల 16 నుంచి ప్రారంభమయ్యే యాత్రకు చేయవలసిన ఏర్పాట్లపై సీఎం విజయన్ సమీక్ష నిర్వహించారు. భక్తుల సంఖ్యను సవరించవలసి వస్తే, చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు విజయన్.
 
శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. 25 వేల మందికి ప్రత్యక్ష దర్శనంతో పాటు…వర్చువల్ క్యూ సిస్టమ్ కొనసాగుతుందన్నారు. పదేళ్ళ లోపు, 65 ఏళ్లు పైబడిన వయసుగలవారిని కూడా శబరిమల దేవాలయంలోకి అనుమతించనున్నారు. దర్శనానికి వచ్చేవారు కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాలని, లేదా…నెగెటివ్ ఆర్‌టీపీసీఆర్ రిపోర్టు చూపించాలన్నారు.
 
అయ్యప్పను దర్శనం తర్వాత సన్నిధానం వద్ద ఉండటానికి అనుమతి లేదన్నారు కేరళ సీఎం. ఎరుమేలి, పులిమేడు అటవీ మార్గాల ద్వారా ఈ ఏడాది కూడా భక్తులను అనుమతించబోతమని స్పష్టం చేశారు. వాహనాల్లో నీలక్కల్ వరకు వచ్చి…. అక్కడి నుంచి పంపా నదికి కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments