Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌లో సమస్యలు - 10 లక్షల బెంజ్ కార్లు వెనక్కి

Benz Car
Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (08:57 IST)
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్.యు.వి సిరీస్‌లోని పలు కార్ల మోడళ్ళలో బ్రేక్ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నమైంది. దీంతో ఈ మోడళ్ళను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకారంగా వివిధ మోడళ్ళకు చెందిన పది లక్షల కార్లు వెనక్కి తీసుకోనుంది. 
 
ఈ మోడల్ కార్లన్నీ 2004 నుంచి 2015 వరకు తయారైన ఎస్.యు.వి సిరీస్‌లోని ఎంఎల్, జీఎల్, ఆర్- క్లాస్ లగ్జరీ మినీ వ్యాన్ మోడళ్లు ఉన్నాయి. ఈ కార్లకు అమర్చిన బ్రేకులు తుప్పుపట్టడంతో బ్రేకింగ్ సిస్టమ్ సరిగా పని చేయడం లేదని, అందువల్ల వెనక్కి తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చింది. 
 
లోపాలను సరిచేసి వెనక్కి ఇచ్చేస్తామని, అందువల్ల ఆ మోడళ్లను ఆయా కార్ల యజమానులు అప్పగించాలని ఆ కంపెనీ కోరింది. దీంతో మొత్తం 9,93,407 రీకాల్ చేస్తున్నట్టు, ఇందులో ఒక్క జర్మనీలోనే దాదాపు 70 వేల కార్లు ఉన్నాయని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments