Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐకాన్స్ ఆఫ్ భారత్: అసలైన భారతీయ గాధలను వేడుక చేసుకునేలా ఎన్డీ టీవీపై నూతన సిరీస్

Advertiesment
Icons
, శనివారం, 4 జూన్ 2022 (18:30 IST)
ఇండియన్ మనీ.కామ్‌లో భాగమైన ఫ్రీడమ్ యాప్ ఈ తరహాలో మొదటిదిగా ‘ఐకాన్స్ ఆఫ్ భారత్’ షోను ఎన్డీటీవీ నెట్వర్క్ పైన ప్రసారం చేయనుంది. ఇప్పటివరకూ వినని రీతిలో భారతీయ రైతులు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలు, గృహిణుల విజయగాధలను ఈ షో వేడుక చేయనుంది. వీరంతా చూసేందుకు సాధారణ జీవితాలను గడుపుతున్నట్లుగా అనిపించవచ్చు. కానీ అసాధారణ జీవితాలకు వారు సారథ్యం వహించారు. తమ నైపుణ్యాలను లాభదాయ సాగు, వ్యాపార కార్యకలాపాలుగా మలుచుకున్నారు.

 
ఐకాన్స్ ఆఫ్ భారత్ అనేది ఒక టెలివిజన్ సిరీస్. మెరుగైన భారతదేశాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్న ప్రజానీకం నిజజీవితగాధలను అది వేడుక చేస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు, సేద్యం లేదా ఇంటి నుంచే మరేదైనా వ్యాపారం ద్వారా తమ జీవనోపాధులను మెరుగుపర్చుకోవడం ద్వారా ఆర్థిక విజయాలు సాధిం చేందుకు ఎన్నో రకాల అడ్డంకులను అధిగమించిన అలాంటి పారిశ్రామికవేత్తలు, రైతులందరినీ మేం గౌరవిస్తున్నాం. 14 ఎపిసోడ్ సిరీస్ ఎన్డీటీవీలో 2022 జూన్ 5 నుంచి ప్రసారం కానుంది. ఆదివారం నాడు రాత్రి 9.30 గంటల నుంచి 10.30 గంటల దాకా. రిపీట్ ఎపిసోడ్ శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది.

 
మనం భారతదేశ 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని వేడుక చేసుకుంటున్న నేపథ్యంలో ఐకాన్స్ ఆఫ్ భారత్ అనేది కల కనేందుకు సాహసించిన వారి అసాధారణ ధైర్యసాహసాలను, స్ఫూర్తిని వేడుక చేసుకునే వేదికగా ఉండాలని ఎన్డీ టీవీ ఇండియా భావిస్తోంది. తమ తమ రంగాల్లో విజయాలు సాధించిన ప్రజల విజయగాధలను ప్రదర్శించడం ద్వారా లక్షలాది భారతీ యులకు స్ఫూర్తి కలిగించాలని ఐకాన్స్ ఆఫ్ భారత్ కోరుకుంటోంది. వ్యవసాయం, హోమ్ బేకింగ్, క్యాండిల్ మేకింగ్, చాకొలెట్-మేకింగ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఇంకా మరెన్నో రంగాల నుంచి ఈ ఐకాన్స్ ఉంటారు. ఒక నైపుణ్యాన్ని పొందేందుకు పెద్దగా విద్యార్హత లేదా పెద్ద డిగ్రీ అవసరం లేదని, నేర్చుకోవాలనే కల, పాత కాలపు భావనలను బద్దలుగొట్టాలనే సంకల్పం ఉంటే చాలనే విషయాన్ని భారతీయులు గుర్తించేలా చేయడం ఈ షో లక్ష్యం.

 
ఈ సందర్భంగా ఇండియన్ మనీ.కామ్ వ్యవస్థాపకులు, సీఈఓ సిఎస్ సుధీర్ మాట్లాడుతూ, ‘‘భారతదేశం అంతర్జాతీయ సూపర్ పవర్ అయ్యే మార్గంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దారి తీసే రీతిలో ప్రతీ ఆంత్రప్రె న్యూర్, ప్రతీ రైతు తన వంతు తోడ్పాటు అందిస్తేనే అది సాధ్యపడుతుంది. అయితే తరచూ దీన్ని విస్మరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ‘ఐకాన్స్ ఆఫ్ భారత్’ వెనుక ఉన్న ఆలోచన ఉద్భవించింది. ఇలాంటి వారి గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని విశ్వసిస్తున్నాం. అంతేకాదు, ప్రస్తుత, రేపటి తరాలను ప్రభావితం చేసే శక్తి కూడా వారికి ఉంది’’ అని అన్నారు.

 
ఈ సందర్భంగా ఎన్డీ టీవీ సహవ్యవస్థాపకులు డాక్టర్ ప్రణయ్ రాయ్ మాట్లాడుతూ, ‘‘ఐకాన్స్ ఆఫ్ భారత్’’తో అనుబంధం ఏర్పరచుకునేందుకు ఎన్డీటీవీ ఎంతో సంతోషిస్తోంది. భారతదేశంలోని విజయగాధలపై ఇది దృష్టి పెడుతుంది. ఇండియన్ మనీ యొక్క ఫ్రీడమ్ ప్లాట్‌ఫామ్‌తో పని చేయడం చూస్తుంటే, ఈ షో కోట్లాది మంది భారతీయులకు తప్పకుండా స్ఫూర్తి కలిగిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్‌ గేమ్స్‌తో రూ.36 లక్షలు స్వాహా... ఫ్రీ ఫైర్ ఆడుతూ...