Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదిలో దూసుకెళుతున్న మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్స్

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (18:54 IST)
దేశంలో ఉన్న ప్రైవేట్ ఆరోగ్య బీమా కంపెనీల్లో ఒకటైన మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 37 శాతం వృద్ధిని నమోదు చేయడమేకాకుండా రూ.500 కోట్లకుపైగా ప్రీమియం మొత్తాన్ని వసూలు చేసింది. వచ్చే రెండేళ్ళలో ఈ వృద్ధిరేటును రెండింతలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు ఆ కంపెనీ చీఫ్ మార్కెంటింగ్ ఆఫీసర్ సప్నా దేశాయ్, ప్రాడక్ట్స్ హెడ్ అశీష్ యాదవ్‌లు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై వారు మాట్లాడుతూ, తమ వ్యాపారంలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమన్నారు. 2022-23 ఆర్థిక సం వత్సరంలో 37 శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్టు తెలిపారు. దక్షిణ భారతంలో 25 శాఖలు, 5 వేల పాయింట్ ఆఫ్ సేల్స్ సెంటర్లు ఉన్నాయన్నారు. 20 వేల మంది అడ్వైజర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తమకు దక్షిణాదిన 3,300కి పైగా నెట్‌వర్క హాస్పిటల్స్ ఉండగా, దేశ వ్యాప్తంగా ఈ సంఖ్య 8700కు పైగా ఉన్నాయని తెలిపారు. 
 
వచ్చే రెండేళ్ళలో తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకునే దిశగా సరికొత్త ప్రయాణికలతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఇతర ఆరోగ్య బీమా పాలసీలకు తమ పాలసీకు ఉన్న వ్యత్యాసాన్ని వారు వివరించారు. పోర్టబిలిటీ ద్వారా వేరే కంపెనీ హెల్త్ పాలసీ కలిగిన వ్యక్తి తమ కంపెనీ పాలసీలోకి మారొచ్చని తెలిపారు. ఉదాహరణకు రూ.10 లక్షల ఆరోగ్య పాలసీ కలిగివుంటే, దాన్ని మొబైల్ పోర్టబిలిటీ ద్వారా తక్కువ ప్రీమియంతో రూ.50 లక్షలకు హెల్త్ పాలసీని పొందే సౌకర్యం ఉందన్నారు. పాలసీదారుని వయస్సును బట్టి ప్రీమియం మొత్తం మారుతుందని వివరించారు. అలాగే, తమ కంపెనీ సెటిల్మెంట్లు 96 శాతంగా ఉందని వారు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments