Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిర్చి కోసం గోద్రెజ్ గ్రేసియాను ఉపయోగించడం కొనసాగిస్తామన్న 74% ఏపీ-తెలంగాణ రైతులు

Chilli
, శనివారం, 22 జులై 2023 (19:40 IST)
గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ ఈరోజు 74% ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు మిర్చి కోసం గోద్రెజ్ గ్రేసియాను వచ్చే సీజన్‌లో కూడా ఉపయోగించాలనే తమ ఆసక్తి ని వెల్లడించారు. మిరప పంట దిగుబడిని సగటున 30%-35% వరకు ప్రభావితం చేసే తెగుళ్లతో, గోద్రెజ్ గ్రేసియా పొలాల్లో ఆకు తినడం, రసం పీల్చడం వంటి లార్వా, గొంగళి పురుగులు, త్రిప్స్ (తామర పురుగు ) వంటి చీడపీడలపై అద్భుతమైన నియంత్రణను ప్రదర్శిస్తుంది.
 
2022లో విడుదల చేసిన, గోద్రెజ్ గ్రేసియా అనేది జపాన్‌కు చెందిన నిసాన్ కెమికల్ కార్పొరేషన్ ద్వారా కనుగొనబడిన, అభివృద్ధి చేయబడిన పేటెంట్ రసాయనం, GAVL సహకారంతో భారతదేశంలో పరిచయం చేసింది. సరైన సమయంలో క్రియాశీలంగా వినియోగించటం ద్వారా, ఇది తెగుళ్లను నియంత్రించడంలో మరింత ఎక్కువ కాలం పనిచేయటంతో పాటుగా ప్రభావాన్ని చూపుతుంది. వర్షాభావ పరిస్థితులలో సైతం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సంప్రదాయమైన వాటితో సహా ఇతర పరిష్కారాలతో పోలిస్తే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిష్కారాలకు ఇది ఆర్థిక, సమర్థవంతమైన ప్రత్యామ్నాయం, రోజుకు అతి తక్కువ ఖర్చుతో పంటకు తగిన రక్షణను అందిస్తుంది.
 
GAVL, క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్, సీఈఓ రాజవేలు ఎన్‌కె మాట్లాడుతూ, 'గత సీజన్‌లో, దాదాపు 95% మిర్చి పంటలు త్రిప్స్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ, ఇతర కీటక సంహారులతో పంటను నాశనం చేసే తెగుళ్లు, త్రిప్స్‌పై గ్రేసియా యొక్క శీఘ్ర నియంత్రణతో, విడుదల చేసిన 14 నెలల స్వల్ప వ్యవధిలో రైతుల నడుమ చక్కటి నమ్మకాన్ని సంపాదించటం చూడటం సంతోషాన్నిస్తుంది. రైతులు ఇప్పుడు ఈ ఉత్పత్తిని 'మై గ్రేసియా' అని పిలుస్తున్నందున, తదుపరి సీజన్‌లో కూడా గ్రేసియాను ఉపయోగించాలనే ఉద్దేశ్యాన్ని ప్రదర్శిస్తున్నందున, వారు దానిని డబ్బుకు విలువైన పరిష్కారంగా భావిస్తున్నారని ఇది స్పష్టంగా సూచిస్తుంది" అని అన్నారు. 
 
“GAVL వద్ద, భారతీయ మార్కెట్‌కు సరిపోయే పరిష్కారాలను పరిచయం చేయడం మాత్రమే కాకుండా రైతు కు ఆర్ధికంగా కూడా ప్రయోజనం అందించడం చేయాలన్నది మా ప్రయత్నం. సిఫార్సు చేసిన పరిమాణంలో ప్రామాణికమైన ఉత్పత్తిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు సరైన అవగాహన కల్పించటం మరియు మా ఆవిష్కరణల ద్వారా అది సాధించగలమని   మేము విశ్వసిస్తున్నాము, ”అని ఆయన అన్నారు.CRISIL భాగస్వామ్యంతో GAVL నిర్వహించిన స్వతంత్ర అధ్యయనం ప్రకారం, మొదటి స్ప్రే తర్వాత గ్రేసియా ప్రభావాన్ని రైతులు చూడటం తో 75% మంది రైతులు ఈ ఉత్పత్తిని తిరిగి కొనుగోలు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో ఏపీ, తెలంగాణ రైల్వే స్టేషన్లు