Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యంత ఆధునిక కొత్త సెల్టోస్ ఆరంభించిన కియా

Advertiesment
Seltos
, శుక్రవారం, 21 జులై 2023 (19:49 IST)
దేశంలో ప్రీమియం కారు తయారీదారు కియా ఇండియా, ఈ రోజు కొత్త సెల్టోస్‌తో ఉత్తమమైన సెల్టోస్ డ్రైవ్ అనుభవాన్ని ప్రత్యేకమైన పరిచయ ధర రూ.10,89,900 (ఎక్స్-షోరూం)కి పాన్-ఇండియా విడుదల చేసింది. ఈ నెల ఆరంభంలో అనగా 4 జులై 2023న విడుదల చేయబడిన కొత్త సెల్టోస్ అత్యంతగా ఆశించబడిన ఎస్‌యూవీ. ఇది 18 వేరియెంట్స్‌లో డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్స్ రెండిటిలో రూ. 19,79,900- రూ. 19,99,900 కి, ఎక్స్-షోరూం ధరకి పాన్-ఇండియా వ్యాప్తంగా లభిస్తోంది. గత వారం, కొత్త సెల్టోస్ అనూహ్యమైన స్పందన పొందింది. శ్రేణిలోనే అత్యధికంగా 1వ రోజు 13,424 యూనిట్స్ బుక్కింగ్స్‌ను నమోదు చేసింది.
 
విజయవంతంగా విడుదలైన సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, శ్రీ. తే-జిన్ పార్క్, మేనేజింగ్ డైరక్టర్ మరియు సీఈఓ, కియా ఇండియా ఇలా అన్నారు, “మార్కెట్లో పోటీయుత ధరలకు ధీటుగా ఆధునిక ఆఫరింగ్స్‌తో పరిశ్రమలోనే ప్రమాణాలను నెలకొల్పడానికి మా నిబద్ధత గతంలో శ్రేణుల అభివృద్ధిని ప్రోత్సహించింది. కొత్త సెల్టోస్ ఇదే పోకడను కొనసాగిస్తుందని అనడంలో ఎటువంటి సందేహంలేదు. ఆధునిక ఏడీఏఎస్ లెవెల్ 2, ఉన్నతమైన భద్రతా ఫీచర్స్, ఆధునిక టెక్నాలజీతో, నేటి అభిరుచి గల ఆధునిక కస్టమర్స్‌కు అనుగుణంగా ఉండే ప్రేరేపిత వాహనాన్ని మేము తయారుచేసాం. విస్తృత శ్రేణి వేరియెంట్ ఎంపికలు, ఆకర్షణీయమైన ధర, సమస్యలు లేని యాజమాన్య అనుభవంతో, కొత్త సెల్టోస్ స్మార్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇవ్వడమే కాకుండా మార్కెట్లో ఉత్తమమైన కొనుగోలుగా కూడా నిలిచింది.”
 
తన ఆకర్షణీయమైన డిజైన్, దృఢమైన రూపం, ఆధునిక స్టైలింగ్ తో కొత్త కియా సెల్టోస్ ప్రత్యేకంగా నిలిచింది. ఇది కియా వారి ‘వ్యతిరేకమైనవి ఐక్యమయ్యాయి’ డిజైన్ సిద్ధాంతాన్ని ప్రదర్శిస్తుంది. అందరి దృష్టిని ఆకర్షించే ఆధునికత యొక్క వెలుగును ప్రసరిస్తుంది. భారతదేశం కోసం ప్రత్యేకించి పరిచయం చేయబడిన ప్యూటర్ ఆలివ్ రంగు ఎస్‌యూవీ రూపాన్ని మరింత మెరుగుపరిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో రైతు ఇంట్లో 400 కేజీల టమోటాలు చోరీ