Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో గిగా ఫైబర్‌కి పోటీగా టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్

జియో గిగా ఫైబర్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇతర బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు పోటీని తట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ డీటీహెచ్ సేవల సంస్థ టాటా స్కై త్వరలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. జియో బ్రాడ్‌బ్యాండ్ సే

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (22:25 IST)
జియో గిగా ఫైబర్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇతర బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు పోటీని తట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ డీటీహెచ్ సేవల సంస్థ టాటా స్కై త్వరలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వచ్చేలోగా తన సేవలను 12 నగరాల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగానే టాటా స్కై తన సేవలను ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, భోపాల్, చెన్నై, గుర్గావ్ నగరాలలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తన వెబ్‌సైట్‌లో పొందుపరచింది.
 
ఈ సేవల్లో భాగంగా ఫిక్సడ్ లైన్ కనెక్షన్‌ల ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను నెల, మూడు నెలలు, ఐదు నెలలు, తొమ్మిది నెలలు మరియు ఏడాది పాటు ప్యాకేజీల రూపంలో అందించనుంది. ఈ డేటా ప్యాకేజీలు 5 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకూ అందుబాటులో ఉంటాయి.
 
5 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ పొందాలంటే నెలకు రూ.999, 10 ఎంబీపీఎస్‌కు రూ.1,150, 30 ఎంబీపీఎస్‌కు రూ.1,500.. 50 ఎంబీపీఎస్‌కు రూ.1,800, 100ఎంబీపీఎస్‌కు రూ.2,500 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. వీటితో పాటు ఐదు అదనపు ప్యాకేజీలు కూడా ఉన్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 1 జీబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ అందించనుంది. జియో గిగా ఫైబర్‌కు సంబంధించిన ప్లాన్‌లు ఏవీ వెల్లడించనప్పటికీ నమోదు ప్రక్రియను మాత్రం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇతర బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు సైతం వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments