Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.981కే విమాన టికెట్... ఇండిగో డిస్కౌంట్ సేల్ ఆఫర్

దేశంలో ఉన్న ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో సంస్థ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా, కేవలం 981 రూపాయలకే విమాన టికెట్ అందిస్తోంది. జమ్మూ

Advertiesment
రూ.981కే విమాన టికెట్... ఇండిగో డిస్కౌంట్ సేల్ ఆఫర్
, మంగళవారం, 14 ఆగస్టు 2018 (14:30 IST)
దేశంలో ఉన్న ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో సంస్థ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా, కేవలం 981 రూపాయలకే విమాన టికెట్ అందిస్తోంది. జమ్మూ - శ్రీనగర్‌ల మధ్య విమాన టికెట్ ధర రూ.981గా నిర్ణయించింది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుంది. ఈ టికెట్‌ను ఆగస్టు 15వ తేదీలోపు బుక్ చేసుకుని సెప్టెంబర్ 11 నుంచి అక్టోబరు 8వ తేదీ మధ్య ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. అలాగే మరికొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో కూడా ఈ ఆఫర్లను ప్రకటించింది.
 
ఈ డిస్కౌట్ సేల్ ప్రకారం.. హైదరాబాద్-అహ్మదాబాద్‌ ప్రాంతాల మధ్య టికెట్ ధర రూ.1,992, హైదరాబాద్-లక్నోల మధ్య రూ.2,456, కోల్‌కతా-బెంగళూరుల మధ్య రూ.3,634, కోల్‌కతా-భువనేశ్వర్ ప్రాంతాల మధ్య రూ.1,379, కోల్‌కతా-ఢిల్లీ మధ్య రూ.2,836, కోల్‌కతా-హైదరాబాద్ ప్రాంతాల మధ్య రూ.2,594, ముంబై-బెంగళూరుల మధ్య రూ.1,748, ముంబై-ఢిల్లీ ప్రాంతాల మధ్య రూ.2,255, బెంగళూరు-ఢిల్లీల మధ్య రూ.2,929, అహ్మదాబాద్-బెంగళూరుల మధ్య రూ.2,078, అహ్మదాబాద్-ఢిల్లీల మధ్య రూ.1,415), బెంగళూరు-గోవాల మధ్య రూ.1,782, బెంగళూరు-గోవా ప్రాంతాల మధ్య రూ.1,782, గౌహతి-కోల్‌కతాల మధ్య రూ.1,793 ధరల్లో విమాన టికెట్లు లభ్యం కానున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీకి అడ్డుకట్ట .. టీడీపీతో పొత్తుకు సిద్ధం : రాహుల్ గాంధీ