Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవన్ సాథి డాట్ కామ్ వారి ప్రచార కార్యక్రమంలో యాంకర్ శ్రీముఖి

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (19:37 IST)
మ్యాట్రిమోనీ సైట్ జీవన్ సాథి డాట్ కామ్ ప్రచార రెండవ దశలో తెలుగు టెలివిజన్ రంగంలో ప్రముఖ వ్యక్తి అయిన శ్రీముఖిని ఎంపిక చేశారు. తెలుగువారి మధ్యన ప్రాధాన్యత పొందాలనే ఒక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, బ్రాండ్ ఉయ్ మ్యాచ్ బెటర్ 360 ప్రచార మొదటి దశకి మహేష్ బాబును ఎంపిక చేయగా, ఆ ప్రయత్నం భారీ విజయాన్ని సాధించింది. ఆ ప్రచారంలో తెలుగువారి ఆదరణ రిజిస్ట్రేషన్ల పరంగా 3 రెట్లు పెరిగింది.

 
ఈ ప్రచారం గురించి ఇన్ఫో ఎడ్జ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుమీత్ సింగ్ మాట్లాడుతూ, "శ్రీముఖికి టెలివిజన్ వ్యాఖ్యాతగా, నటిగా మంచి పాపులారిటీ ఉంది. తమకు తగిన జీవిత భాగస్వామిని వెతకటంలో వారి అభిరుచులని, సవాళ్లను మేము బాగా అర్థం చేసుకున్నామని మా వీక్షకులకు తెలియచేయడానికి ఈ ప్రచారం రూపొందించబడింది.

 
జీవన్‌సాతి వారి చక్కని సిఫార్సుల ఇంజిన్‌లు, 20+ ఫిల్టర్‌లలో లక్షలాదిగా ఉన్న ధృవీకరించబడిన ప్రొఫైల్స్ నుండి ఎవరికి నచ్చిన భాగస్వామిని వారు తెలుసుకొనడం ఎంతో సులభంగా ఉంటుంది. ఈ దశలో జీవన్‌సాతి.కామ్‌కు గొప్ప ప్రయోజనం ఉంటుందని, తెలుగువారి సమాజం మా మార్కెట్ స్థానాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని మేము చాలా గట్టిగా విశ్వసిస్తున్నాము.

 
ఈ ప్రచారం గురించి శ్రీముఖి మాట్లాడుతూ, “జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు, మీ ఇరువురి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం, మీ వ్యక్తిత్వానికి అనుబంధంగా ఉండే భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మిమ్మల్ని అర్థం చేసుకుని, మీ కుటుంబంతో చక్కగా కలిసిపోయి మీ సంప్రదాయాలకు విలువనిచ్చే జీవిత భాగస్వామి మీకు రావాలి. ఈ విషయాన్ని జీవన్‌సాతి బాగా అర్థం చేసుకుంది. ఇంక తన ప్లాట్‌ఫారమ్ ద్వారా మీకు సరైన జీవిత భాగస్వామిని వెతకటం అనేది ఎంతో సులభం చేస్తుంది. ఇందుకు సంబంధించిన అత్యంత శోధన ఫిల్టర్‌లను ఏర్పాటు చేసింది.”  

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments