Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవన్‌సాథి డాట్ కామ్ వారి వియ్ మ్యాచ్ బెటర్ ప్రచారంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సహకారం

Advertiesment
జీవన్‌సాథి డాట్ కామ్ వారి వియ్ మ్యాచ్ బెటర్ ప్రచారంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సహకారం
, సోమవారం, 20 సెప్టెంబరు 2021 (23:42 IST)
ఇండియాలోని ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్,  జీవన్‌సాథి డాట్ కామ్, వియ్ మ్యాచ్ బెటర్ ప్రచారానికి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటులు అయిన మహేష్ బాబు తన సహకారం అందిస్తున్నారు. 360 డిగ్రీ బ్రాండ్ మార్కెటింగ్ ప్రచారం అనేది ప్రత్యేకించి తెలుగు మాట్లాడే ప్రేక్షకుల కోసం, వారు కోరుకునే మ్యాచ్‌లను తెలుసుకొనడానికి జీవన్‌సాథి డాట్ కామ్‌పై పూర్తి నమ్మకం ఉంచాలని కమ్యూనిటీని ఉత్సాహపరచే ప్రయత్నంలో భాగంగా రూపొందించబడింది.
 
జీవన్‌సాథి డాట్ కామ్‌తో ఉన్న అనుబంధంలో భాగంగా, మహేష్ బాబు బ్రాండ్‌తో కలిసి తెలుగువారి సంప్రదాయాలు మరియు సంస్కృతుల విలువల అవగాహనలో సహకరిస్తారు. తన భార్యకు ఒక మంచి భాగస్వామి అయిన మహేష్ బాబు ఈ ప్రాంతంలో సూపర్‌స్టార్ మాత్రమే కాక గొప్ప ఫ్యాన్ ఫేవరెట్. అందువలన, చక్కని జోడి కోసం చూస్తున్న వ్యక్తులని సరైన అవకాశాలతో గొప్పగా ప్రేరేపించడానికి జీవన్‌సాథికి వారి ప్రభావం ఎంతగానో సహాయ పడుతుంది.
 
ప్రముఖ తెలుగు ఛానెల్స్ మరియు తెలుగు బిగ్ బాస్ మరియు తెలుగు KBC వంటి ప్రభావవంతమైన కార్యక్రమాలలో మహేష్ బాబు నటించిన 25 సెకన్ల టీవీ కమర్షియల్‌తో ప్రచారం ప్రారంభించడం, ప్రాంత సంస్కృతిని అర్థం చేసుకునే మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫారానికి బ్రాండ్ ఒక మంచి గుర్తింపు అవుతుంది. తెలుగు రిసెప్షన్ వేడుక మధ్యలో సెట్ చేయబడిన TVCలో, ధృవీకరించబడిన ప్రొఫైల్‌లను మాత్రమే పరిచయం చేసే జీవన్‌సాథి డాట్ కామ్ యాప్ ద్వారా మహేష్ బాబు, తన కుమార్తెకు తగిన మ్యాచ్‌ని చూడడములో ఆందోళన చెందుతున్న ఒక తండ్రికి సహాయం చేస్తున్నాడు. అంతేకాకుండా, జీవన్‌సాథి డాట్ కామ్ టీవీ ద్వారా జరుగుతున్న ప్రచారంలో భాగంగా షార్ట్ ఫిల్మ్‌లను దశలవారీగా విడుదల చేయాలని యోచిస్తోంది. 360 డిగ్రీ బ్రాండ్ మార్కెటింగ్ ప్రచార విస్తరణలో భాగంగా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా, ప్రింట్ మరియు ఎంపిక చేసిన నగరాల్లో ఇంటి వెలుపల ప్రకటనలు కూడా ఉంటాయి.
 
ప్రభావం కలిగించే ప్రచారాల గురించి వ్యాఖ్యానిస్తూ, ఇన్ఫో ఎడ్జ్‌లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయిన సుమీత్ సింగ్ మాట్లాడుతూ, “జీవన్‌సాథి అంటే సరైన జీవిత భాగస్వామిని తెలుసుకొనడం, అంతే కాకుండా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని అతిపెద్ద పేర్లలో ఒకటి, నిబద్ధత కలిగిన చిరకాల జీవిత భాగస్వామిగా మహేష్ బాబు దీనికి ఒక నిజమైన ఉదాహరణ. ఆయన అన్ని వయసుల వారితో సమానంగా పాపులర్ అయ్యారు మా బ్రాండ్ అంబాసిడర్‌గా వారు మాతో ఉండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది.
 
ఈ 360 డిగ్రీ ప్రచారం మా ప్రేక్షకులకోసం రూపొందించబడింది, జీవన్‌సాథి డాట్ కామ్ లో, మేము వారి అవసరాలను ఇతరులకన్నా బాగా అర్థం చేసుకుని వారికి తగిన జీవిత భాగస్వాములను ఎంచుకునేలా ఒక పరిష్కారాన్ని చూపిస్తాము. తెలుగు మాట్లాడే సమాజంలో మహేష్ బాబు ప్రభావం జీవన్‌సాథి డాట్ కామ్‌కి బాగా ఉపయోగపడుతుందని మరియు మార్కెట్‌లో మా స్థానాన్ని బలోపేతం చేయడములో మాకు ఎంతగానో సహాయపడుతుందని మేము హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాము.”
 
ఈ ప్రచారం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ, "మన జీవితంలో మనం తీసుకునే అతి పెద్ద నిర్ణయాలలో ఒకటి మనకోసం సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం. మన జీవిత అర్ధభాగాలను ఎన్నుకునేటప్పుడు, మన భాగస్వామికి ఆసక్తికరమైనవి ఏమిటి మరియు వారికి సంతోషం కలిగించేది ఏమిటి - ఇద్దరిలో కలిసే భావాలు ఏమిటి అనేది ఎప్పుడూ పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఎంచుకునేవారితో మీ భావాలు సరిపోయినప్పుడు అది మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. జీవన్‌సాథి డాట్ కామ్ అప్లికేషన్‌తో మీరు ఇది ఎంతో సజావుగా చేయవచ్చు” అని అన్నారు.
 
“ఇంక, పరిస్థితులు ఎలా ఉన్నా మీ పక్షాన నిలబడటానికి సిద్ధంగా ఉన్న భాగస్వామి మీతో ఉండాలి. నమ్రత నేను ఒకరికొకరం అలాగే ఉంటాము ఇంక ఇదే మా సంతోషకరమైన జంట. జీవన్‌సాథి డాట్ కామ్ దీన్ని అర్థం చేసుకుంటుంది అందువలన వారి ప్లాట్‌ఫారమ్ ద్వారా మీకు సరైన జీవిత భాగస్వామిని తెలుసుకొనడం ఎంతో సులభం అవుతుంది - అత్యంత సంబంధిత సెర్చ్ ఫిల్టర్‌లతో అమర్చబడింది,” అని ఆయన చెప్పారు.
 
జీవన్‌సాథి డాట్ కామ్ మ్యాట్రిమోనీ కేటగిరీలో అత్యంత కఠినమైన 5-దశల ధృవీకరణ ప్రక్రియ ఉంటుంది. 100% ప్రొఫైల్స్ ప్రత్యక్ష పరిశీలనలు మరియు మొబైల్ నంబర్ స్క్రీనింగ్ చేస్తారు. ఇంకా, ప్రభుత్వ ఐడి నంబర్ ధృవీకరణ లేదా వ్యక్తిగతంగా వచ్చిన ప్రొఫైల్‌లకు 'ధృవీకరించబడిన' స్టాంప్ మంజూరు చేయబడుతుంది. భాగస్వామిని తెలుసుకొనదములో సురక్షితమైన వేదికను ఏర్పరచే ప్రాముఖ్యతను బ్రాండ్ అర్థం చేసుకుంటుంది. జీవన్‌సాథి వారి సంబంధిత సెర్చ్ ఫిల్టర్‌లు మరియు బెస్ట్-ఇన్-క్లాస్ రికమండేషన్ అల్గోరిథంతో భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారో తెలుసుకుని వధూ వరులకు సరిపోయే ఒక విషయాలగురించి గొప్పగా చెబుతుంది!
 
ఇటీవలి కాలంలో, బ్రాండ్ తన స్థానాన్ని మెరుగుపరచడానికి వివిధ రంగాల ప్రముఖులతో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మరియు వీడియో ప్రచారాలపై నేరుగా తన ప్రయత్నాలను చేసింది. ఇటీవల, పంజాబీ చలనచిత్ర మరియు సంగీత పరిశ్రమలో ప్రసిద్దులు అయిన సోనమ్ బజ్వాతో జీవన్‌సాథి కూడా భాగస్వామి అయ్యింది, ప్లాట్‌ఫారమ్ లక్షణాలు ఎవరికైనా తమ ఆదర్శ భాగస్వామిని సులభంగా కనుగొనడంలో సహాయపడతాయని ప్రేక్షకులకు తెలియజేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మాస్టర్ భువన్: పిన్న వయస్సులో తొలి భారతీయుడు రికార్డు