Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఆర్‌సీటీసీ చౌక ధరలో ప్యాకేజీ.. పూరీ జగన్నాథ్ ట్రిప్‌కు రెడీనా..?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (11:09 IST)
లాక్‌డౌన్‌లో ఇంట్లో వుండి బోర్ కొట్టేసిందా..? అయితే సూపర్ ట్రిప్పుకు రెడి అయిపోండి. ఐఆర్‌సీటీసీ చౌక ధరలో ప్యాకేజీని అందిస్తోంది. దీని కోసం రూ.6 వేలు కడితే సరిపోతుంది. సూపర్ ట్రిప్ వేసేయొచ్చు.
 
వివరాల్లోకి వెళితే.. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈసారి జగన్నాథ యాత్రను తీసుకువచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో పూరి, భువనేశ్వర్, కోణార్క్ ప్రాంతాలను మొత్తం చూసి వచ్చేయొచ్చు.
 
సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ ప్రాంతాల్లో రైలు ఎక్కొచ్చు. మళ్ళీ టూర్ అయిపోయాక ఎవరి స్టేషన్స్‌లో వాళ్ళు దిగొచ్చు. ఈ టూర్ మొత్తం ఐదు రోజులు పాటు ఉంటుంది. సికింద్రాబాద్‌లో అర్థరాత్రి రాత్రి 12.05 గంటలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది.
 
ఇక దీని ధర విషయం లోకి వస్తే.. టూర్ ప్యాకేజీ ధర రూ.5,250గా ఉంది. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఐదు ఏళ్ళు కనుక దాటితే మాత్రం ఫుల్ అమౌంట్ కట్టాలి. స్లీపర్ క్లాస్ ధర రూ.5,250 గా ఉంది. 3 టైర్ ఏసీలో కావాలంటే రూ.6,300 చెల్లించాలి. ఇదిలా ఉండగా ఫుడ్, షెల్టర్ వంటివి అన్నీ ఐఆర్‌సీటీసీనే చూసుకుంటుంది.

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments