Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ ఉపయోగిస్తే..?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:36 IST)
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ మళ్లీ ఇక్యాటరింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రైల్వే ప్రయాణికులు ట్రైన్‌లో వారికి నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ ఇవ్వొచ్చు.

ఫిబ్రవరి 1 నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలోనే ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 250 ట్రైన్స్‌లో ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. 
 
కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ గతంలో ఇక్యాటరింగ్ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇవి మళ్లీ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యాయి. రైల్వే ప్రయాణికులు ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని భావిస్తే.. ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. 
 
ఈ యాప్ ద్వారా సులభంగా ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ వద్దనుకుంటే https://www.ecatering.irctc.co.in/ వెబ్‌సైట్ ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. 
 
దేశవ్యాప్తంగా ఉన్న 500 రెస్టారెంట్ల ద్వారా ఫుడ్ డెలివరీ పొందొచ్చు. మీకు నచ్చిన ఫుడ్ పొందొచ్చు. దీని కోసం పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ పేరు, సీటు/బెర్త్ నెంబర్ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. ట్రైన్ జర్నీ చేసే వారికి ఈ సర్వీసుల వల్ల ఊరట కలుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments