Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వేశాఖ

Webdunia
ఆదివారం, 5 మే 2019 (11:58 IST)
ప్రయాణికులకు రైల్వే శాఖ అనుబంధ సంస్థ ఐఆర్‌సిటిసి శుభవార్త చెప్పింది. తమ వెబ్‌సైట్ ద్వారా రైలు ప్రయాణ టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఎవరైనా రిజర్వేషన్ చేసుకున్న తర్వాత ఎక్కే స్టేషన్ మార్చుకోవాలంటే కనీసం 24 గంటల సమయం పడుతోంది. ఒకవేళ బోర్డింగ్ స్టేషన్‌లో ప్రయాణికులు రైలు మిస్సైన పక్షంలో రిజర్వేషన్‌ను రద్దు అవుతుంది. 
 
ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న తర్వాత బోర్డింగ్ స్టేషన్‌లోకాకుండా మరోచోట ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు బోర్డింగ్ స్టేషన్ మరోచోటుకి మార్చుకునే సౌలభ్యాన్ని తాజాగా ఐఆర్‌సిటిసి అందుబాటులోకి తీసుకువచ్చింది. 
 
అయితే, ఈ సౌకర్యం ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికోసం ఐఆర్‌సిటిసిలో వెబ్‌సైట్‌లో ఐడి పాస్‌వర్డ్ లాగిన్ కావాలి. అనంతరం బుకింగ్ టికెట్ హిస్టరీలోకి వెళ్లి, రైలును ఎంచుకొని బోర్డింగ్ పాయింట్ మార్చుకుంటే సరిపోతుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments