Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన పొదుపు పథకం- ఐసీఐసీఐ ప్రు గ్యారెంటీడ్‌ ఇన్‌కమ్‌ ఫర్‌ టుమారో

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (23:22 IST)
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు నూతన లక్ష్య ఆధారిత పొదుపు పథకం- ఐసీఐసీఐ ప్రు గ్యారెంటీడ్‌ ఇన్‌కమ్‌ ఫర్‌ టుమారో (గిఫ్ట్‌)ను ఆవిష్కరించింది. ఇది పాలసీదారులకు హామీ ఇవ్వబడిన ఆదాయం అందించడంతో పాటుగా తమ సుదీర్ఘకాలపు ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు తోడ్పడుతుంది. ఈ లైఫ్‌ కవర్‌ పాలసీదారుని కుటుంబానికి ఆర్థిక భద్రతను సైతం అందిస్తుంది.
 
ఈ పొదుపు పధకంలో మూడు రకాలు:
ఆదాయం: ఈ పాలసీదారుడు గ్యారెంటీడ్‌ ఆదాయ రూపంలో 5, 7 లేదా 10 సంవత్సరాల కోసం మెచ్యూరిటీ ప్రయోజనం అందుకోగలరు. చిన్నారుల విద్య కోసం ప్రణాళిక చేయాలనుకునేవారికి ఇది అత్యంత అనువైనది.
 
ఎర్లీ ఇన్‌కమ్‌: ఈ వేరియంట్‌లో రెండవ సంవత్సరం నుంచే వినియోగదారులు ఆదాయం అందుకోవడం ప్రారంభిస్తారు. దీనినే గ్యారెంటీడ్‌ ఎర్లీ ఇన్‌కమ్‌గా వ్యవహరిస్తారు. 
 
సింగిల్‌ పే లమ్‌సమ్‌: దీనిలో వినియోగదారులు ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. జీవిత భీమాతో పాటుగా గ్యారెంటీడ్‌ రిటర్న్స్‌ ప్రయోజనాలను సైతం వినియోగదారులు ఆస్వాదించవచ్చు.
 
ఐసీఐసీఐ ప్రు గ్యారెంటీడ్‌ ఇన్‌కమ్‌ ఫర్‌ టుమారోలో మరో వినూత్నమైన అంశం సేవ్‌ ద డేట్‌ ఫీచర్‌. తమ వ్యక్తిగత జీవితంలో మైలురాళ్లను చేరుకునేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ ఆవిష్కరణ గురించి శ్రీ అమిత్‌ పల్టా, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మాట్లాడుతూ, ‘‘మేము ఇటీవలనే 20వ వార్షికోత్సవం వేడుక చేసుకున్నాం. ఇప్పుడు ఐసీఐసీఐ ఫ్రు గ్యారెంటీడ్‌ ఇన్‌కమ్‌ ఫర్‌ టుమారో (గిఫ్ట్‌)ను విడుదల చేశాం. ఇది వినియోగదారులకు సుదీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలను అందించనుంది. ఇది వినియోగదారులకు సంపదను సృష్టించడంతో పాటుగా వైవిధ్య అవసరాలనూ తీర్చనుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments