Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చీజ్‌ ఉత్పత్తుల విభాగంలో ప్రవేశించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

చీజ్‌ ఉత్పత్తుల విభాగంలో ప్రవేశించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌
, మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (17:15 IST)
నూతన సంవత్సరారంభాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తూ, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఇప్పుడు చీజ్‌ ఉత్పత్తుల విభాగంలో  మొజ్జారెల్లా చీజ్‌, ప్రాసెస్డ్‌ చీజ్‌ఆవిష్కరణతో ప్రవేశించింది. వీటతో పాటుగా కూల్‌ కేఫ్‌, ఫ్రెష్‌ క్రీమ్‌ కూడా ఆవిష్కరించింది.
 
హెరిటేజ్‌ మొజ్జారెల్లా చీజ్‌ మరియు ప్రాసెస్డ్‌ చీజ్‌ను 100% స్వచ్ఛమైన ఆవు పాలతో తయారుచేశారు. అత్యంత రుచికరంగా, సువాసన భరింతగా ఇది ఉండటంతో పాటుగా నోటిలో కరిగిపోయే రీతిలో మృదువుగా ఉంటుంది. అన్ని వయసుల వారూ ఆరగించే రీతిలో  చీజీ ఫ్లేవర్‌తో సహజసిద్ధంగా దీనిని తయారుచేశారు. విటమిన్‌ ఏ మరియు ఇతర మినరల్స్‌ దీనిలో ఉంటాయి. అతి సులభంగా జీర్ణమయ్యే ప్రొటీన్‌ ఇది కలిగి ఉండటంతో పాటుగా కాల్షియం సైతం కలిగి ఉంటుంది. అలాగే చెప్పుకోతగ్గ పరిమాణంలో ఫాస్పరస్‌ కూడా దీనిలో ఉంది.
 
చీజ్‌ వేరియంట్స్‌ మొజ్జారెల్లా (500 గ్రాములు), బ్లాక్స్‌ (200 గ్రాములు, 400 గ్రాములు, ఒక కేజీ) రూపంలో ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. ప్రయాణ సమయాలలో సైతం అతి సులభంగా తాగగలిగే డ్రింక్‌ హెరిటేజ్‌ కూల్‌ కేఫ్‌. తమ కాఫీ స్ట్రాంగ్‌గా ఉండాలనుకునే వారికి ఇది ఆహ్లాదకరమైన అనుభవాలను అందిస్తుంది. పాల యొక్క చక్కదనం మరియు రియల్‌ కాఫీ పౌడర్‌ మిశ్రమమిది. దీనిలో తగు పరిమాణంలో కాల్షియం ఉంటుంది. ఇది 180 మిల్లీ లీటర్ల ప్యాక్‌లో రావడంతో పాటుగా పెద్దలకు అవసరమైన కాల్షియంలో 40% అందిస్తుంది.
 
టెట్రా ప్యాక్‌లో హెరిటేజ్‌ ఫ్రెష్‌ క్రీమ్‌ వస్తుంది. దాదాపు 25% ఫ్యాట్‌తో తాజా, స్వచ్ఛమైన మిల్క్‌ క్రీమ్‌ను ఇది అందిస్తుంది. సూప్స్‌, కర్రీలు, సలాడ్‌-ఫ్రూట్స్‌, కూరగాయలకు ఇది చక్కటి సహచరిగా ఉంటుంది. బసుందీ, కేక్‌, మిల్క్‌ స్వీట్లు, డెస్సర్ట్స్‌, కస్టర్డ్‌ మొదలైన వాటి  తయారీకి ఇది అనువుగా ఉంటుంది. దీనిని 200 మిల్లీలీటర్ల ట్యాంపర్‌ ఫ్రూఫ్‌ కార్టన్స్‌లో ప్యాక్‌ చేశారు.
 
ఈ నూతన ఉత్పత్తులు ఆధునిక రిటైల్‌ స్టోర్లు, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌, హెరిటేజ్‌ పార్లర్స్‌, హెరిటేజ్‌ టచ్‌ యాప్‌ ద్వారా లభ్యమవుతాయి. శ్రీమతి బ్రాహ్మణి నారా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ, ‘‘భారతీయ గృహాలలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విలువ ఆధారిత పాల ఉత్పత్తిగా ఇది నిలుస్తుంది. ఇటీవలి కాలంలో ఇంటి బయట ఆహారం తీసుకోవడమనే ధోరణి తగ్గినప్పటికీ, ఇంటిలోనే వినియోగదారులు విభిన్నమైన రెసిపీలను ప్రయత్నిస్తున్నారు. మొజ్జారెల్లా చీజ్‌, ప్రాసెస్డ్‌ చీజ్‌ వంటి ఉత్పత్తుల ఆవిష్కరణ ద్వారా ఈ ధోరణిని ఒడిసిపట్టుకుంటున్నాం. అదే రీతిలో మా బేవరేజ్‌ విభాగాన్ని కూల్‌ కేఫ్‌ ఆవిష్కరణతో బలోపేతం చేస్తున్నాం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్ హాసన్ పార్టీ అసెంబ్లీ టిక్కెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం