Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్పత్తిని నిలిపివేసిన హోండా : వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (11:56 IST)
ద్విచక్రవాహనాల ఉత్పత్తి సంస్థ హోండా సంస్థ ఉత్పత్తిని నిలిపివేసింది. ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా దేశంలో ద్విచక్రవాహనాల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో హర్యానా రాష్ట్రంలోని మనేసర్ ఉత్పత్తి కేంద్రాన్ని హోండా కంపెనీ నిరవధికంగా మూసివేసింది. ఈ మేరకు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఈ ప్లాంటు కార్మికులు గత కొంతకాలంగా సమ్మె చేస్తుండగా, సాధారణ కార్యకలాపాలన్నీ నిలిపివేశామని సంస్థ ప్రకటించింది. యూనియన్ నేతలు, ప్లాంట్ మేనేజ్‌మెంట్ మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదని ఈ సందర్భంగా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
యూనియన్ నేతలు, శాశ్వత ఉద్యోగులు కలిసి కాంట్రాక్ట్ కార్మికులను రెచ్చగొడుతున్నాయని, కంపెనీ ప్రాంగణంలోనే వీరంతా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దిగారని హోండా ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో బైక్‌ల తయారీ సాధ్యం కాదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత, పనులు ప్రారంభమవుతాయని వెల్లడించింది.
 
కాగా, బైక్‌ల తయారీలో కోత విధించిన తర్వాత, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 5 నుంచి హోండా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి రాజకీయ పార్టీలు, మిగతా ప్లాంట్ల యూనియన్లు మద్దతిస్తున్నాయి. ఇక్కడ రోజుకు తయారయ్యే బైక్‌ల సంఖ్య 6 వేల నుంచి 3,500కు తగ్గడంతో దాదాపు 1000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments