Webdunia - Bharat's app for daily news and videos

Install App

59 నిమిషాల్లో బ్యాంకు రుణం... ఎలాగో చూడండి...

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (15:15 IST)
సాధారణంగా బ్యాంకులో లోన్ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అదే ప్రభుత్వరంగ బ్యాంకులో అయితే సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు. ప్రభుత్వ బ్యాంక్‌ల నుండి రుణం పొందడానికి బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) రుణాలు తీసుకునే వారికి తియ్యటి కబురు చెప్పింది. 
 
వచ్చే పండుగ సీజన్‌లో లోన్ తీసుకునే వారిని ఆకర్షించడమే లక్ష్యంగా హౌసింగ్, వాహన రుణాలను తక్కువ వడ్డీకే అందించడంతో పాటు రుణాల తిరిగి చెల్లింపు కాలం కూడా సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది. రుణాలు తీసుకునే వారి సంఖ్యను పెంచేందుకు ఏకంగా గృహ, వాహన రుణాలను 59 నిమిషాల్లో అందించడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
 
ఎస్‌బిఐతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్‌లు, psbloansin59minutes పోర్టల్ ద్వారా చిన్న, మధ్య స్థాయి వ్యాపారవేత్తలకు ప్రస్తుతం కోటి రూపాయల వరకు రుణాలను అందిస్తుండగా, ఈ పరిధిని ఇకపై రీటైల్ రుణాలకు సైతం వర్తింపజేయనున్నట్లు బ్యాంక్‌లు ప్రకటించాయి. 
 
హౌసింగ్, వాహన రుణాలను కూడా ఈ పోర్టల్ పరిధిలోకి తీసుకురానున్నట్లు ఎస్‌బిఐ అధికారులు తెలియజేసారు. లోన్ ప్రాసెస్ ప్రక్రియను 59 నిమిషాల్లో పూర్తి చేసి, సంబంధిత సంస్థలకు వారం రోజుల్లోగానే రుణాన్ని మంజూరు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments