Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిద్ధార్థ ఆత్మహత్య... లాభాల బాటపట్టిన కాఫీ డే

Advertiesment
Coffee Day Enterprises Share Price
, సోమవారం, 19 ఆగస్టు 2019 (21:48 IST)
కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యతో కాఫీ డే షేర్లు ఒక్కసారిగా నష్టాలు చవిచూశాయి. భారీ నష్టాల్లో పడిపోయిన కాఫీ డే షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. ఒకవైపు రుణ భారాన్ని తగ్గించుకునే చర్యల్లో కాఫీ డే యాజమాన్యం రంగంలోకి దిగింది. 
 
మరో వైపు పానీయాల గ్లోబల్ కంపెనీ కోకా కోలా వాటాను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు కారణాల దృష్ట్యా కాఫీ డే షేర్లు బలంగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోలుతో 5 శాతానికిపైగా లాభపడి రూ.65.80 వద్ద అప్పర్ సర్క్యూట్ అయ్యింది. సిద్ధార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడు వారాల్లో 68శాతం పతనమయ్యింది. 
 
కాగా, పానీయాల రిటైల్ స్టోర్ల కంపెనీ కాఫీడే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ రూ.2,400 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో గ్రూపు రుణ భారం ఆమేర తగ్గించనుందని వివరించింది. జులై చివరికల్లా గ్రూపు రుణభారం రూ.4970 కోట్లుగా నమోదైనట్లు తెలియజేసింది. దీనిలో కాఫీడే రుణభారాన్ని రూ.3472 కోట్లుగా పేర్కొంది.
 
ప్రధానంగా బెంగళూరులోని గ్లోబెల్ విలేజ్ పార్క్‌ను పీఈదిగ్గజం బ్లాక్ స్టోన్ కు విక్రయించడం ద్వారా ఈ రుణభారాన్ని తగ్గించుకోనున్న సంగతి తెలిసిందే. మరోవైపు కంపెనీలో వాటాను విక్రయించేందుకు కోకో కోలాతో కాఫీ డే తిరిగి చర్చలు ప్రారంభించింది. ఈ అంశాలన్నీ షేర్లు బలపడటానికి దోహదం చేశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్‌లో ఆంక్షల సడలింపు: తిరిగి ప్రారంభమైన పాఠశాలలు