Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతులకు శుభవార్త: రూ.లక్షకే E-ట్రాక్టర్..ఎక్కడ?

Advertiesment
రైతులకు శుభవార్త: రూ.లక్షకే E-ట్రాక్టర్..ఎక్కడ?
, గురువారం, 22 ఆగస్టు 2019 (14:38 IST)
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఇప్పటికే ఇ-బైక్స్, ఇ-బైసైకిల్స్ భారత మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, అలాగే వాటి వల్ల పెరిగే వాతావరణ కాలుష్యం వెరసి E వాహనాలకు డిమాండ్ వచ్చింది.


ఇప్పటికే టూ వీలర్‌లు, ఫోర్ వీలర్‌లు, ఇ-బస్సులు అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు సోలార్ ఉత్పత్తులు ఎలాగూ ఉన్నాయి. ఈ క్రమంలో అందరి దృష్టి ఈ వెహికల్‌పై పడ్డాయి. వ్యవసాయానికి ముఖ్యమైన వాహనం ట్రాక్టర్ కూడా అదే బాటపట్టింది. త్వరలో మార్కెట్‌లోకి E ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయి. 
 
అస్సోంలోని దుర్గాపూర్‌లో ఉన్న సీఎస్ఐఆర్‌-సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ (CMWRI) పరిశోధకులు E ట్రాక్టర్‌ను డెవలప్ చేస్తున్నారు. బ్యాటరీతో పనిచేసే ఈ చిన్న ఎలక్ట్రానిక్ ట్రాక్టర్‌ 10హెచ్‌పీ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ట్రాక్టర్ ధర రూ. లక్ష వరకు ఉంటుందని వారు తెలిపారు. రైతులకు మరింత తక్కువ ధరకు వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలియజేసారు.
 
భారత మార్కెట్‌లో ఇదే అతి తక్కువ ధర ఉండే ట్రాక్టర్‌‌గా మారనుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న E-ట్రాక్టర్‌ను ఒక సంవత్సరం లోపే తమ పరిశోధనా కేంద్రంలో ట్రయల్ టెస్టింగ్ చేస్తామని సీఎస్ఐఆర్‌-సీఎంఈఆర్‌ఐ డైరెక్టర్‌ హరీశ్‌ హిరానీ తెలిపారు. 
 
చిన్న మరియు సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని E-ట్రాక్టర్‌ను తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. లిథియం-అయాన్‌ బ్యాటరీతో నడిచే E-ట్రాక్టర్ బ్యాటరీని ఒకసారి ఛార్జింగ్ చేసినట్లయితే గంట సమయంపాటు పని చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు చేయి తాకిన చిదంబరానికి జైలు కష్టాలు... ఎవరు?