Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు శుభవార్త... ఏంటది?

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (14:42 IST)
వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త చెప్పింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు తక్షణం బెర్తు కేటాయించేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేపట్టింది. ఈ ప్రయత్నాలు శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయోగాత్మకంగా చేపట్టగా అవి విజయవంతమయ్యాయి. దీంతో మిగిలిన రైళ్ళలో కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. 
 
సాధారణంగా వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు కేటాయిస్తారు. అయితే రెండు, మూడు స్టేషన్‌ల వరకు ఎదురుచూసిన తర్వాత మాత్రమే టీటీఈ ఆ బెర్త్‌ను కేటాయిస్తాడు. ఇకపై అలాంటి అవసరం ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. 
 
మొదటి స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరిన తర్వాత ఎవరైనా ప్రయాణికుడు కన్ఫర్మ్‌ అయిన తన టికెట్‌ను రద్దు చేసుకుంటే, వెంటనే ఆ టికెట్‌ను నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికుడికి ఇస్తారు. రద్దయిన టికెట్‌ గురించి వెంటనే టీటీఈకి హ్యాండ్‌హెల్డ్‌ డివైజెస్‌ ద్వారా సమాచారం అందిస్తారు.
 
శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఇప్పటికే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా నిర్వహించారు. మొదటి దశలో టీటీఈలకు 500, రెండో దశలో 8 వేల హ్యాండ్‌హెల్డ్‌ డివైజెస్‌ అందజేస్తారు. ఈ విధానాన్ని అని రైళ్లలో ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం