Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయింపు : కేంద్రం ప్రతిపాదన

ఠాగూర్
గురువారం, 21 ఆగస్టు 2025 (19:54 IST)
దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంలపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను పూర్తిగా మినహాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీఓఎం) చర్చించిందని, త్వరలోనే దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక సమర్పించనున్నట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి, జీఓఎం కన్వీనర్ సామ్రాట్ చౌదరి వెల్లడించారు.
 
బుధవారం జరిగిన మంత్రుల బృందం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం తీసుకునే ఆరోగ్య, జీవిత బీమా పాలసీలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ స్పష్టమైన ప్రతిపాదన అని ఆయన తెలిపారు. ఈ అంశంపై సమావేశంలో చర్చించామని, జీఎస్టీ కౌన్సిల్కు సమర్పించబోయే నివేదికలో ఈ విషయాన్ని పొందుపరుస్తామని చెప్పారు.
 
పన్ను రేట్లను తగ్గించాలన్న విషయంలో మంత్రుల బృందంలోని సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు. అయితే, కొన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలను ప్రత్యేకంగా తెలియజేశాయని, వాటన్నింటినీ నివేదికలో చేర్చుతామని అన్నారు. పన్ను రేట్లపై తుది నిర్ణయం మాత్రం జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
 
దేశంలో జీఎస్టీ సంస్కరణలలో భాగంగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భవిష్యత్తులో వస్తువులను 'మెరిట్', 'స్టాండర్డ్' అనే రెండు కేటగిరీలుగా విభజించి, కేవలం 5, 18 శాతం చొప్పున రెండు పన్ను స్లాబులనే అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇన్సూరెన్స్ పాలసీలకు ఊరట కల్పించాలని భావిస్తోంది. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రూపంలోనే ప్రభుత్వానికి రూ.8,262 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments