Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిలయన్స్ జియో రూ.799 రీచార్జ్ ప్లాన్‌ను రద్దు చేసిందా?

Advertiesment
jio recharge
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో అందుబాటులో ఉన్న రూ.799 రీజార్జ్ ప్లాన్‌ను రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ కంపెనీ తాజాగా వివరణ ఇచ్చింది. రూ.799 రీచార్జ్ ప్లాన్ రద్దు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని జియో తోసిపుచ్చింది. ఆ ప్లాన్ కొనసాగుతుందని, యూజర్లు ఎప్పటిలానే రీచార్జి చేసుకోవచ్చని స్పష్టత నిచ్చింది. జియో వెబ్‌సైట్‌తో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ ఫ్లాట్‌ఫామ్‌లలో ఈ ప్లాన్‌తో అందుబాటులోనే ఉంచినట్టు వివరణ ఇచ్చింది. 
 
యూజర్లు అవసరాలకు అనుగుణంగా అందుబాటు ధరలో రీచార్జి ప్లాన్‌లను అందించేందుకు కట్టుబడివున్నట్టు జియో పేర్కొంది. రూ.799 ప్లాన్‌తో రీచార్జి‌తో రీచార్జి చేసుకుంటే 84 రోజుల కాలపరిమితి పొందవచ్చని పేర్కొంది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని వివరించింది. అదేవిధంగా ఈ ప్లాన్‌లో రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు పొందవచ్చని రిలయన్స్ జియో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ