Publish Date: Thu, 30 Jan 2025 (19:57 IST)
Updated Date: Thu, 30 Jan 2025 (19:58 IST)
రిలయన్స్ జియో కొత్త ఏడాదిని పురస్కరించుకుని రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ డేటా ఎక్కువగా అవసరమైన వారికి ఈ ప్లాన్ చాలా బెస్ట్. ఈ ప్లాన్ గడువు రేపు అంటే జనవరి 31తో ముగియనుంది. ఈ ప్లాన్ ద్వారా 200 రోజుల వ్యాలిడిటీ, 500 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రిలయన్స్ జియో యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తుంటుంది. అందులో భాగంగా న్యూ ఇయర్ పురస్కరించుకుని కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.
స్పెషల్ ప్లాన్ కావడంతో జనవరి 31తో ముగియనుంది. రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అది కూడా హైస్పీడ్ డేటా. ఇంటర్నెట్ అధికంగా వినియోగించేవారికి ఇది చాలా అవసరం. ఈ రెండింటితో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా లభిస్తాయి.