Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AP State Budget 2025-26: Highlights: ఏపీ బడ్జెట్.. సూపర్ సిక్స్‌కు పెద్దపీట.. బడ్జెట్ హైలైట్స్ ఇవే

Advertiesment
AP State Budget

సెల్వి

, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (11:44 IST)
AP State Budget
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్​లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్​లో పెద్ద పీట వేశారు. ఈ ఏడాదిలోనే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్​లో వెల్లడించారు.
 
అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15 వేలు కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తింపు చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టారు.
 
బడ్జెట్ హైలైట్స్ 
మొత్తం బడ్జెట్ - రూ. 3.22 లక్షల కోట్లు
రెవెన్యూ వ్యయం - రూ. 2,51,162 కోట్లు
మూలధన వ్యయం - రూ. 40,635 కోట్లు
రెవెన్యూ లోటు - రూ. 33,185 కోట్లు
ద్రవ్య లోటు - రూ. 79,926 కోట్లు
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు 
వ్యవసాయానికి - రూ. 48 వేల కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు - రూ. 6,705 కోట్లు
అన్నదాత సుఖీభవకు - రూ. 6,300 కోట్లు
పాఠశాల విద్యకు - రూ. 31,805 కోట్లు
ఉన్నత విద్యకు - రూ. 2,506 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు - రూ. 1,228 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం - రూ. 4,332 కోట్లు
ఆర్ అండ్ బీ కి - రూ. 8,785 కోట్లు
ఇంధన శాఖకు - రూ. 13,600 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం - రూ. 10 కోట్లు.
బీసీ సంక్షేమానికి - రూ. 47,456 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి - రూ. 20,281 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి - 8,159 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల కోసం - రూ. 5,434 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు - 18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు - రూ. 13,862 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు - రూ. 6,318 కోట్లు
జలవనరుల శాఖకు - రూ. 18,019 కోట్లు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బయట ఆడుకుంటున్న చిన్నారి - అపహరించి అఘాయిత్యం - ప్రైవేట్ భాగాలపై 28 కుట్లు!