Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గుముఖం పడుతున్న బంగారం..

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (11:22 IST)
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితుల కారణంగా ఎప్పటికప్పుడు మారుతుంటుంది బంగారం ధర. ఈసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ఇప్పుడు తగ్గుతోంది. 
 
ఒకవైపు ఇంధనం ధరలు పెరిగిపోతుంటే.. బంగారం ధరలు కాస్త తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బుధవారం బంగారం ధరలు తగ్గాయి. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది.  
 
ఇక ధరల విషయానికి వస్తే.
22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 47750 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయిలు తగ్గి 52100 గా ఉంది
వెండి కేజీ ధర 600 రూపాయిలు తగ్గి 72100 గా ఉంది.
 
నగరాల్లో బంగారం ధరలు 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 750 రూపాయలు కాగా, 24 క్యారెట్ల ధర బంగారం పది గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది. 
 
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 750 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది. 
 
ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 750 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments