Publish Date: Thu, 24 Mar 2022 (11:14 IST)
Updated Date: Thu, 24 Mar 2022 (11:17 IST)
పసిడి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670లుగా ఉంది.
నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 400 తగ్గగా.. 24 క్యారెట్ల ధరపై కూడా రూ. 430 దిగొచ్చింది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.67,600గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ. 1300 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,670గా ఉంది.