పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారు ధరలు మరోమారు పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం ప్రభావం బంగారం ధరలపై పడింది. ద్రవ్యోల్బణం భయంతో అనేక మంది మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ఈ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో తాజాగా బంగారం రూ.53 వేలు దాటిపోయింది.
ఈ యుద్ధం కారణంగా ప్రస్తుతం ముడి చమురు ధర 139 బ్యారెళ్లకు చేరింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిపై పెట్టుబడి పెడుతున్నారు.
ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 2069 డాలర్లకు చేరడంతో అపుడు దేశఁలో పది గ్రాముల బంగారం ధర రూ.55 వేలు దాటి రూ.55,100కు చేరుకుంది. అలాగే, వెండి ధర రూ.72,900కు పెరిగింది. శుక్రవారం కూడా మరోమారు ఔన్స్ బంగారం ధర రూ.1995 డాలర్లకు పెరిగింది. దీంతో దేశీయ విఫణిలో పది గ్రామాల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,680కు చేరింది. వెండి ధర రూ.70,500కు పెరిగింది.