Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ సీజన్.. రద్దీ మార్గాల్లో ఇపుడే పెరిగిపోయిన విమాన చార్జీలు

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (14:45 IST)
దేశంలో పండగ సీజన్ మొదలైంది. దీంతో రద్దీ మార్గాల్లో విమాన చార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ పండగ సీజన్ కోసం అప్పుడే విమాన టికెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఫలితంగా రద్దీ మార్గాల్లో విమాన ఛార్జీలు అధికమవుతున్నాయి. దీపావళి ఒకటో తేదీకి ముఖ్యమైన దేశీయ మార్గాల్లో ఒకవైపు ప్రయాణానికే టికెట్ ధర సగటున 10-15 శాతం పెరిగింది. 
 
ఓనం పండగ (సెప్టెంబరు 15) సమయంలో, కేరళ నగరాలకు వెళ్లే కొన్ని విమానాల్లో ఛార్జీలను 20-25 శాతం పెంచేశారని ట్రావెల్ పోర్టల్ ఐక్సిగో వెల్లడించింది. అక్టోబరు 30- నవంబరు 5 మధ్య ఢిల్లీ- చెన్నై నాన్ స్టాప్ విమానంలో ఒకవైపు ఎకానమీ సగటు ఛార్జీ 25 శాతం పెరిగి రూ.7,618గా ఉందని వెల్లడించింది. 
 
ముంబై- హైదరాబాద్ మార్గంలో ఛార్జీ 21 శాతం పెరిగి రూ.5,162కు, ఢిల్లీ - గోవా, దిల్లీ - అహ్మదాబాద్ మార్గాల్లో ఛార్జీలు 19 శాతం పెరిగి వరుసగా రూ.5,999, రూ.4,930గా ఉన్నాయని ఐక్సీగా పేర్కొంది. కొన్ని ఇతర మార్గాల్లో ఛార్జీల భారం 1-16 శాతంగా ఉంది. గతేడాది దీపావళి పండుగ సమయమైన నవంబరు 10-16 తేదీల మధ్య ఉన్న ప్రయాణ ఛార్జీలతో పోల్చి, ఐక్సిగో ఈ విశ్లేషణ చేసింది.
 
గతేడాదితో పోలిస్తే ఈసారి దీపావళికి ప్రయాణ గిరాకీతో పాటు ఛార్జీలు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీ-చెన్నై, ముంబై-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్ వంటి రద్దీ మార్గాల్లో ఛార్జీలు 10-15 శాతం పెరిగి రూ.4000-5000కు చేరాయని ఐక్సిగో గ్రూప్ సహ సీఈఓ రజనీశ్ కుమార్ తెలిపారు.
 
అదేసమయంలో కొన్ని మార్గాల్లో ఛార్జీలు యేడాది క్రితంతో పోలిస్తే 1-27 శాతం తగ్గడం గమనార్హం. ముంబయి-అహ్మదాబాద్ మధ్య టికెట్ ధర 27 శాతం తగ్గి రూ.2,500కు, ముంబై- ఉదయ్‌పూర్ మార్గంలో ఛార్జీ 25 శాతం తక్కువగా రూ.4,890గా ఉంది. బెంగళూరు-హైదరాబాద్ విమాన ఛార్జీ 23 శాతం తగ్గి రూ.3,383గా ఉంది. ముంబై-జమ్మూ విమాన ఛార్జీ 21 శాతం తగ్గి రూ.7,826గా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments