Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా కార్లు బహుమతిగా ఇచ్చిన కంపెనీ యజమాని.. ఎక్కడ?

car gift
, శనివారం, 4 నవంబరు 2023 (10:02 IST)
సాధారణంగా పండగల సమయంలో ఒకటి రెండు నెలల వేతనాన్ని బోనస్‌‌గా ఇస్తుంటారు. లేదా ఖరైదీన బహుమతులు ఇస్తారు. కానీ, హర్యానా రాష్ట్రానికి చెందిన ఫార్మా కంపెనీ అధినేత తన కంపెనీలో ఉని చేసే బెస్ట్ ఉద్యోగులకు ఏకంగా కార్లను దీపావళి బహుమతిగా అందజేశారు. దీంతో ఆ ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బులై పోతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హర్యానా రాష్ట్రానికి చెందిన మిట్స్ హెల్త్ కేర్ ఫార్మా సంస్థ డైరెక్టర్ ఎంకే భాటియా తన ఉద్యోగులకు టాటా పంచ్ కార్లను కానుకగా అందజేశారు. కంపెనీలో ఉద్యోగులను సెలబ్రిటీలుగా పేర్కొన్న ఆయన.. మంచి పనితీరు కనబరిచిన 12 మందికి కార్లను బహుమతిగా ఇచ్చారు. వీరంతా కేవలం ఉద్యోగులే కాదు.. సెలబ్రిటీలు అన్నారు. భవిష్యత్తులో మరికొందరికి కార్లను బహుమతిగా ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే, టాటా పంచ్ కార్లను గిఫ్ట్ పొందిన వారి జాబితాలో ఆఫీస్ బాయ్ కూడా ఉండటం విశేషం.
 
తన కంపెనీ విజయంలో ఉద్యోగులదే కీలక పాత్ర అని.. వారంతా కఠోర శ్రమ, అంకితభావం, విధేయతతో పనిచేసి కంపెనీ ఎదుగుదలకు సహకరించారని ప్రశంసించారు. కార్లను గిఫ్ట్ పొందినవారిలో కొందరు కంపెనీ ప్రారంభించినప్పటి ఆయన వెంటే ఉన్నారు. ఈ కార్లు కేవలం దీపావళి కానుకలు కాదని.. కంపెనీపై తన ఉద్యోగులు చూపించిన నిబద్ధత, విశ్వాసానికి బహుమతులని భాటియా పేర్కొన్నారు. అయితే, ఈ కార్లను గిఫ్టుగా పొందిన వారిలో కొందరు ఉద్యోగులకు అసలు కారు ఎలా నడపాలో కూడా తెలియకపోవడం గమనార్హం. కలలో కూడా తాము ఊహించని గిఫ్టును తమ బాస్ ఇవ్వడంతో కొందరు ఉద్యోగులు అవాక్కయ్యారట!
 
ఈ సందర్భంగా భాటియా మీడియాతో మాట్లాడారు. 'ఉద్యోగులు తమను తాము సెలబ్రిటీగా ప్రత్యేకంగా ఫీల్ అవ్వాలని నేను కోరుకున్నా. సానుకూల ఆలోచన వల్లే ఇది జరిగింది, నా కంపెనీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందని.. కానీ ఈ ఉద్యోగులంతా నా వెంటే ఉండి కంపెనీ ఎదుగుదలకు సహకరించారు. వాళ్లే మా స్టార్లు' అని కొనియాడారు. ఈ కార్లను నెల రోజుల క్రితమే ఆయన ఉద్యోగులకు అందజేసి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అయితే, ఈ వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ.. దీపావళి సందర్భంలో ఇలాంటి వార్తలు రావడం యాదృచ్ఛికమేనని.. కాకపోతే దీని గురించి తాను ప్లాన్ చేయలేదని చెప్పారు. భవిష్యత్తులో కార్లు ఇచ్చే సంఖ్యను 12 నుంచి 50కి పెంచే ఆలోచన ఉందన్నారు. ఇక కారు విషయానికి వస్తే.. గిఫ్ట్ ఇచ్చిన టాటా పంచ్ కారు 2021లో విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ.6 లక్షల నుంచి మొదలవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో 24 గంటల్లో రూ.15 కోట్ల విలువైన నగదు స్వాధీనం