Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగుళూరు వాసులను భయపెట్టిన చిరుత మృతి

leopard - bear
, గురువారం, 2 నవంబరు 2023 (14:33 IST)
ఐటీ నగరం బెంగుళూరు వీధుల్లో చిరుత పులి సంచరిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కన్నడ వాసులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. పలు ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న సీసీటీవీ దృశ్యాలను చూసి స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అటవీ శాఖ అధికారులు ఆ చిరుత పులిని బంధించేందుకు 70 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన ఈ బృందం చిరుతను బంధించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బుధవారం చిరుత కుడ్లు గేట్‌ ఏరియా వద్ద తారసపడింది. దాన్ని వలతో బంధించిన తరువాత పశువైద్యుడు మత్తుమందు ఇస్తుండగా అది అకస్మాత్తుగా దాడి చేసింది. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చిరుతను కట్టడి చేసేందుకు మత్తుమందు నింపిన గన్‌ను పేల్చారు. దాంతో స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే దానిని బన్నెరఘట్ట రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. అక్కడ పశువైద్యులు చికిత్స అందజేస్తుండగా మృతిచెందింది. 
 
ఈ చిరుత గత శనివారం తొలిసారి ఎలక్ట్రానిక్‌ సిటీకి సమీపంలోని సింగసంద్ర ప్రాంతంలో కన్పించింది. దానిని రెండు వీధి కుక్కలు వెంబడిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో వైరలైన నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసు, అటవీశాఖ అధికారులు ఓ బృందంగా ఏర్పడి చిరుత కోసం గాలించారు. 
 
అక్టోబరు 29న అది కుడ్లులోని ఓ అపార్ట్‌మెంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. సుదీర్ఘంగా గాలించి ఎట్టకేలకు దాన్ని బంధించేందుకు ప్రయత్నించారు. కాగా.. చిరుత తొలిసారి కన్పించిన సింగసంద్ర ప్రాంతం బెంగళూరు బన్నెరఘట్ట నేషనల్‌ పార్క్‌కు దగ్గరలో ఉంటుంది. చిరుత అక్కడి నుంచే వచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ నగదును అభ్యర్థుల ఖాతాల్లో జమ చేయండి : ఈసీ ఆదేశం